పిక్ టాక్ః రౌడీ స్టార్ హీరోయిన్ బికినీ ట్రీట్ అదిరింది | Ananya Pandey Latest Photo Goes Viral
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ మూవీ 'ఫైటర్' కరోనా కారణంగా నిలిచి పోయింది. త్వరలోనే షూటింగ్ పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాలో అనన్య పాండే నటిస్తున్న నేపథ్యంలో అప్పడిపై తెలుగు ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. సినిమా ఆలస్యం అవుతున్నా కూడా ఆమె గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ తెలుగు ప్రేక్షకులు ఆమెపై అభిమానం పెంచుకుంటున్నారు.
సోషల్ మీడియాలో దాదాపుగా 16 మిలియన్ ల మంది ఫాలోవర్స్ ఉన్న అనన్య పాండే రెగ్యులర్ గా ఫొటోలు వీడియోలు షేర్ చేస్తు వస్తుంది. ఈసారి ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు కుర్రకారుకు హీట్ కలిగించేవిగా ఉన్నాయి. ముద్దుగుమ్మ అనన్య పాండే స్విమ్మింగ్ పూల్ నుండి అలా బయటకు వెళ్తూ ఉన్న ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బికినీలో ఈ అమ్మడి ఫొటో షూట్ అదిరిపోయింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సక్కనమ్మ చిక్కినా అందమే అన్న సామెత ఈమెకు బాగా సూట్ అవుతుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Post a Comment