అటు వెంకీ ఫుల్ స్పీడ్ మీదుంటే.. ఇటు నాగ్ మాత్రం స్లో అయ్యాడు..! | Venkatesh Upcoming Movie Updates
టాలీవుడ్ స్టార్ హీరోలందరూ వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తున్నారు. సీనియర్ హీరో అయిన విక్టరీ వెంకటేష్ కూడా ఫుల్ స్పీడ్ మీదున్నాడు. తమిళ'అసురన్' చిత్రానికి రీమేక్ గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటిస్తున్న 'నారప్ప' చిత్రాన్ని చివరి దశకు తీసుకొచ్చాడు వెంకీ. అలానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో కలిసి 'ఎఫ్ 3' సినిమాలో నటిస్తున్నాడు. సూపర్ హిట్ మూవీ 'ఎఫ్ 2' ఫ్రాంచైజీలో వస్తున్న ఈ చిత్రాన్ని ఇటీవలే సెట్స్ పైకి తీసుకెళ్లాడు. వీటితో పాటు అన్న కొడుకు దగ్గుబాటి రానాతో ఓ మల్టీస్టారర్.. అలానే రామ్ చరణ్ తో మలయాళ 'డ్రైవింగ్ లైసెన్స్' రీమేక్ లను లైన్ లో పెట్టాడని తెలుస్తోంది. ఇలా వెంకటేష్ ఫుల్ స్పీడ్ తో మరో రెండేళ్ల పాటు డైరీ మొత్తం షూటింగ్స్ తో నింపేసుకున్నాడు. అయితే వెంకీకి సమకాలీకుడు అయిన అక్కినేని నాగార్జున మాత్రం స్లో అయినట్లు తెలుస్తోంది.
నిజానికి కింగ్ నాగార్జున కు 'సోగ్గాడే చిన్ని నాయనా' 'ఊపిరి' సినిమాల తర్వాత మంచి కమర్షియల్ హిట్ లేదనే చెప్పాలి. నాగ్ ఎంతో ఇష్టపడి చేసిన 'మన్మథుడు 2' డిజాస్టర్ అవడంతో పాటు.. 'మన్మథుడు' సినిమాని ఉన్న పేరుని చెడగొట్టారనే బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో డిఫరెంట్ కాన్సెప్టుతో 'వైల్డ్ డాగ్' అనే సినిమా చేశాడు. కొత్త దర్శకుడితో తీసిన ఈ సినిమా ఆల్ మోస్ట్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయినట్లేనని టాక్ నడుస్తోంది. అలానే ‘బ్రహ్మాస్త్ర’ అనే బాలీవుడ్ సినిమాలో అమితాబ్ - రణబీర్ కపూర్ - అలియాభట్ లతో కలిసి షూటింగ్ పూర్తి చేశాడు. ఇవి రెండు కూడా నాగ్ అప్పుడెప్పుడో ఓకే చేసిన సినిమాలు. వీటి తరువాత నాగ్ నుంచి ఫీచర్ ఫిల్మ్స్ ఏం వస్తున్నాయో అనే విషయం పై ఎలాంటి క్లారిటీ లేదు. 'PSV గరుడవేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారుతో ఓ క్రైమ్ థ్రిల్లర్ ఉంటుందని అన్నారు కానీ దాని గురించి మరో అప్డేట్ లేదు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' సినిమా ఉంటుందని అన్నారు కానీ అధికారిక ప్రకటన లేదు. కాకపోతే స్మాల్ స్క్రీన్ వైపు అడుగులు వేసిన నాగార్జున 'స్టార్ మా' వారు కొత్తగా చేయబోతున్న ఓ రియాలిటీ షోకి హోస్ట్ గా చేయడానికి సిద్ధం అవుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఏదేమైనా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో మాత్రం వెంకీ కంటే నాగ్ కాస్త స్లో అయ్యాడనే చెప్పుకోవాలి.
Post a Comment