కొడుకులతో అనసూయ ముక్కాల డాన్స్.. మళ్లీ ట్రోల్స్ | Anasuya Bharadwaj Chilling With Her Kids
టాప్ సెలబ్రెటీల్లో చాలా మంది కొత్త సంవత్సర వేడుకల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లారు. ఇక వీలు చిక్కినప్పుడల్లా.. ప్రత్యేక సందర్బాల్లో కుటుంబంతో కలిసి జబర్దస్త్ యాంకర్ అనసూయ విదేశాలకు వెళ్లడం లేదా ఇండియాలోనే ఏదైనా టూరిస్ట్ ప్లేస్ లకు వెళ్లడం చేస్తూ ఉంటారు. కొత్త సంవత్సరం వేడుకల కోసం అనసూయ తన భర్త ఇద్దరు కొడుకులతో కలిసి ఆరావళి పర్వతాల్లోకి వెళ్లారు. అక్కడే న్యూ ఇయర్ వేడుకలను ఆమె చేసుకున్నారు. అందమైన ఆ ప్రాంతంలో విపరీతమైన చలి ఉన్నా కూడా అనసూయ మాత్రం ఎప్పటిలాగే చిన్న స్కర్ట్ వేసుకున్నారు.
ఇద్దరు పిల్లలతో అనసూర అర్థ రాత్రి సమయంలో ముక్కాల ముక్కాబులా పాటకు స్టెప్పులు వేసింది. ఇద్దరు కొడుకులకు డాన్స్ స్టెప్పులు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు తాను సరదాగా ముక్కాల పాట స్టెప్పులను అదరగొట్టింది. అయితే ఎప్పటిలాగే ఈ డ్రస్ లకు కూడా అనసూయ విమర్శలు ఎదుర్కొంది. స్కట్ మరీ పెద్దగా అయ్యింది.. షాప్ లో ఇంత కంటే చిన్నవి దొరకలేదా అంటూ కొందరు.. కొడుకులతో ఇలాంటి డ్రస్ లు వేసుకుని డాన్స్ లు చేయడం నీకే చెల్లింది అంటూ మరి కొందరు ఇంకా పబ్లిసిటీ కోసం ఇలా ఎన్నాళ్లు చేస్తారు మేడం అంటూ ఇంకొందరు అనసూయన ట్రోల్ చేసి పడేశారు. ఎప్పటిలాగే అనసూయ వాటిని చూసి చూడనట్లుగా వదిలేస్తుంది.
Post a Comment