రోబో వివాదం.. దర్శకుడు శంకర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్! | Metropolitan court Issues Non Bailable warrant Against Shankar
దిగ్గజ దర్శకుడు శంకర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్ 2 ఈ వారెంట్ ఇష్యూ చేసింది. ఆరూర్ తమిళ్నాదన్ అనే వ్యక్తి తాను రాసిన కథనే రోబోగా చిత్రీకరించారంటూ కేసు వేశాడు. అయితే.. ఈ కేసు విచారణ సందర్భంగా పలు వాయిదాలకు శంకర్ హాజరు కాలేదు.
‘జిగుబా’ అనే టైటిల్ తో తాను రాసిన కథ ఆధారంగానే రోబో చిత్రాన్ని తీశారని అందుకు తన అనుమతి తీసుకోలేదు అంటూ తమిళనాదన్ కోర్టులో కేసువేశాడు. ఈ వివాదంపై కొన్నేళ్లుగా విచారణ జరుగుతోంది. అయితే.. కోర్టు ముందు హాజరుకావడంలో శంకర్ విఫలమయ్యారు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ప్రస్తుతం ఈ కేసు ఫిబ్రవరి 19కి వాయిదా వేశారు.
తమిళనాదన్ కథ జిగుబా తమిళ మ్యాగజైన్ లో 1996లో పబ్లిష్ అయింది. దానిని ‘ఢిక్ ఢిక్ దీపికా దీపికా’ అనే టైటిల్ తో 2007లో రీ పబ్లిష్ చేశారు. ఆ తర్వాత రోబో తీశారని అది తన రచనకు కాపీ అంటూ తమిళనాదన్ కోర్టుకెక్కారు. తన ఆలోచనతో పెద్ద ఎత్తులో ఆర్థిక లాభం పొందారని ఆరోపించారు.
యంతిరన్ సినిమా 2010లో విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండు జాతీయ అవార్డులను కూడా దక్కించుకుంది. ఈ సినిమాను తెలుగులో రోబోగా హిందీలో రోబోట్ గా డబ్బింగ్ చేశారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో హీరో కమ్ విలన్ గా రజినీ హీరోయిన్ గా ఐశ్వర్యరాయ్ బచ్చన్ నటించారు.
Post a Comment