పుట్టబోయేది అమ్మాయో అబ్బాయో…. తెలిపే బర్త్ చార్ట్ !? 90%సక్సెస్ రేట్ ఉందట ! నిజంగానే ఆ చార్ట్ కు అంత సీన్ ఉందా??
గతంలో ఈ చార్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తాజాగా మరోమారు వాట్సాప్ లలో షేర్ అవుతూ ఉంది.! 700 సంవత్సరాల క్రితం ఓ రాజు సమాధిలో దొరికిందని ప్రచారమౌతున్న ఈ చార్ట్ గురించి…దాని లెక్కల గురించి మొదట చర్చించి దాని బొక్కల గురించి తర్వాత చర్చిద్దాం.!
ఈ చార్ట్ ద్వారా పుట్టబోయేదీ అబ్బాయా..? అమ్మాయా… తెల్సుకునే విధానం:
ఈ చార్ట్ లో అడ్డంగా 18 నుండి 45 వరకు ఇవ్వబడిన అంకెలు ఆడవాళ్ళ వయస్సు ను సూచిస్తాయి. నిలువుగా జనవరి నుండి డిసెంబర్ వరకు ఉండే 12 నెలలు ..వాటికి ఎదురుగా F,M అనే ఇంగ్లీష్ అల్ఫాబెట్స్ ఇవ్వబడ్డాయి.!
- ఉదాహరణ… 18 సంవత్సరాల వివాహిత జనవరిలో నెల తప్పితే….పుట్టబోయేది F అంటే ఫీమేల్ ( అమ్మాయి) అన్నమాట.!
- 25 సంవత్సరాల వివాహిత డిసెంబర్ లో నెల తప్పితే….పుట్టబోయేది M అంటే మేల్ ( అబ్బాయి) అన్నమాట!
- ఇలా వయస్సు….నెల తప్పిన నెలను ఆధారంగా చేసుకొని పుట్టబోయేది అబ్బాయో అమ్మాయో చెప్పేయొచ్చట.!
ఇప్పుడు మన వర్షన్ కు వచ్చేద్దాం.!ఇదంతా వట్టి ట్రాష్…. చార్ట్ లేదు చాంతాడు లేదు.! ఇది ఎవరో అంచనా మీద తయారు చేసింది.! ఏదో ఒకటి, రెండు కరెక్ట్ అయినంత మాత్రానా ఇదేదో చిదంబర రహాస్యం…మనకే దొరికింది వెంటనే షేర్ చేయాలి లేకపోతే కొంపలంటుకుపోతాయని వెంటనే షేర్ చేయకండి.!
పుట్టేది అమ్మాయా? అబ్బాయా? అని ఈ చార్ట్ లు చెప్పలేవు., స్కానింగ్ ద్వారా చెప్పొచ్చు కానీ అలా చెప్పడం చట్టరీత్యా నేరం.! అయినా ఎవరు పుడితే ఏంటి? మనం వారిని ఎలా పెంచాం అనేది ముఖ్యం.! సో సరదాగా చార్ట్ ను చూసేయండి బట్ అదే నిజమని మాత్రం నమ్మేయకండి!
Post a Comment