Header Ads

ఇండియ‌న్ క‌రెన్సీ నోట్ల‌పై ఉండే చిత్రాలు…ఏ నోట్ మీద ఏ చిత్రముందో తెలుసుకోండి ??

konark temple 

ఇండియ‌న్ క‌రెన్సీ నోట్ల‌పై ఉండే చిత్రాలు…మ‌న దేశ సంస్కృతిని, సాంప్ర‌దాయాల‌ను , చ‌రిత్ర‌ను ప్ర‌తిబింబించేలా ఉంటాయి.! ఇటీవ‌ల భార‌త ప్ర‌భుత్వం అనేక కొత్త నోట్ల‌ను కూడా విడుద‌ల చేసింది. ఏ నోట్ మీద ఏ చిత్రముంది, దాని విశిష్ట‌తేంటి,అది ఎక్క‌డ ఉందో తెల్సుకునే ప్ర‌య‌త్నం చేద్దాం!

పది రూపాయల కరెన్సీ నోటు :

పది రూపాయల కరెన్సీ నోటు పై ప్రముఖ హైందవ క్షేత్రమైన కోణార్క్ దేవాలయం ఇమేజ్ ఉంటుంది.ఈ దేవాలయం ఒడిశా రాష్ట్రంలో ఉన్నది.ఈ దేవాలయం నిర్మాణం 13వ శతాబ్దంలో జరిగింది.

konark temple

ఇరవై రూపాయల కరెన్సీ నోటు :

అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్ నగరంలో మౌంట్ హ్యారియెట్ లైట్ హౌస్ ఉన్నది.ఇదే మనకు ఇరవై రూపాయల కరెన్సీ నోటుపై కనిపిస్తుంది.

20 rupes note

కొత్త ఇరవై రూపాయల కరెన్సీ నోటు :

ఈ కొత్త కరెన్సీ నోటుపై యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన ఎల్లోరా కేవ్స్ మనకి కనిపిస్తాయి.ఈ కేవ్స్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఉన్నాయి.

యాభై రూపాయల కరెన్సీ నోటు :

శిల్ప కళకు పెట్టింది పేరైన మహారాష్ట్రలోని హంపిలో రాతి రథం ఈ నోటుపై మనకు దర్శనమిస్తుంది.

Advertisement

50 rupes note

పాత వంద రూపాయల కరెన్సీ నోటు :

ప్రపంచంలో మూడవ అతిపెద్ద పర్వతంగా రికార్డులలోకి ఎక్కిన కాంచన గంగ పర్వతం మనకు ఈ కరెన్సీ నోటుపై కనిపిస్తుంది.ఈ పర్వతం భారతదేశంలోని సిక్కిం రాష్ట్రంలో ఉన్నది.

100 rupes note

కొత్త వంద రూపాయల కరెన్సీ నోటు :

ఈ నోటు పై గుజరాత్ లోని పఠాన్ టౌన్ లో ఉన్న ప్రముఖ చారిత్రాత్మక కట్టడం అయినా ఏడు అంతస్తుల భూగర్భ బావి ” రాణి కి వావ్ ” మనకి కనిపిస్తుంది.ఈ ” రాణి కి వావ్ ” యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లలో ఒకటి.

new 100

ఐదు వంద రూపాయల కరెన్సీ నోటు :

ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ఈ నోటుపై మనకి కనిపిస్తుంది.

రెండు వేలు రూపాయల కరెన్సీ నోటు :

భారతదేశ స్పేస్ ఏజెన్సీ ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన మంగళ్ యాన్ ఈ కరెన్సీ నోటుపై మనకి దర్శనమిస్తుంది.

2000 note


No comments

Powered by Blogger.