"హ్యాపీ బర్త్ డే" అమితాబ్ బచ్చన్
"హ్యాపీ బర్త్ డే" అమితాబ్ బచ్చన్
భారత స్వాతంత్య్రానికి మూడేళ్ళ ముందు అమితాబ్ ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించారు. అమితాబ్ అసలు పేరు ఇక్విలాబ్.. అంటే విప్లవం వర్ధిలాలి అని.. అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ ఓ ప్రసిద్ధ కవి. ఆయనకు జాతీయ స్థాయిలో మంచి పేరు ఉన్నది. అమితాబ్ చిన్న తనం నుంచే సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. ఆ కోరిక 1969 వరకు సాధ్యం కాలేదు. సినిమాల్లోకి వచ్చే ప్రయత్నంలో ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదుర్కొన్నారు. 1969లో భువన్ షోమ్ అనే సినిమాలో నటించారు. చిన్న నటుడిగా మాత్రమే అయన ఈ సినిమాలో కనిపించాడు. ఈ సినిమాకు జాతీయ అవార్డు లభించింది. దీని తరువాత, 1970 హిందుస్తానీ అనే సినిమాలో హీరోగా చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఆనంద్ సినిమాలో సహనటుడిగా నటించి మెప్పించాడు.
ఆ తరువాత వచ్చిన పర్వానా, రేష్మ ఔర్ షేరా సినిమాల్లో విలన్ గా చేశారు. ఈ రెండు సినిమాలు బాగా ఆడాయి. దీంతో అమితాబ్ కు మంచి పేరు వచ్చింది. ఇక 1973లో వచ్చిన జింజర్ సినిమాతో అమితాబ్ లైఫ్ మారిపోయింది ఆ మూవీ సూపర్ హిట్ వరసగా అవకాశాలు వచ్చాయి. తరువాత వచ్చిన షోలే సినిమా అయన కెరీర్లో ది బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక కూలి సినిమా షూటింగ్ సమయంలో అయన గాయపడ్డారు. దాదాపు సంవత్సరం పాటు నటనకు దూరంగా ఉన్నారు. అనంతరం చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 1984 వ సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చి అలహాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే, మూడేళ్లకే అయన రాజీనామా చేశారు. ఆ తరువాత రాజకీయాల జోలికి వెళ్ళలేదు. బిగ్ బి 200 వరకు సినిమాల్లో నటించారు. దీంతో పాటు బుల్లితెర సంచలనం కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం కు హోస్ట్ గా ఉంటూ మెప్పిస్తున్నారు. నేడు బిగ్ బి అమితాబ్ పుట్టినరోజు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుందాం.
Post a Comment