మెగా క్యాంపుని.. పవన్ ని పొగిడేసిన 30 ఇయర్స్ పృథ్వీ! | Prithvi Praises Pawan Kalyan
ఎన్నికల ముందు ఒకలా.. ఎన్నికల తర్వాత ఒకలా మాట్లాడడం రాజకీయ నాయకులకు కొత్తేమీ కాదు. ఇక కమెడియన్ టర్న్ డ్ రాజకీయనేత పృథ్వీ కూడా అలానే యూటర్న్ తీసుకోవడం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తూ మెగా క్యాంపుని పవన్ ని తిట్టేసిన పృథ్వీ ఇప్పుడు యూటర్న్ తీసుకుని రివర్సులో పొగిడేయడం సంచలనమే అయ్యింది.
నిజానికి తనపై `శృంగార పురుష` ముద్ర పడడానికి కారకులు తన పార్టీ(వైసీపీ) పోటీదారులే కారణమని నమ్మే పృధ్వీ దీనిపై చాలాసార్లు చాలా రకాలుగా ఆవేదన వ్యక్తం చేశారు. సెక్స్-టేప్ వివాదం తరువాత అతడు ఆల్మోస్ట్ మీడియా ముందుకు వచ్చేందుకు ఆసక్తిని కనబరచనే లేదు. మాజీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ గా 30 ఇయర్స్ పృథ్వీ లో ప్రొఫైల్ లోనే గడిపేశారు. అయితే ఆయన అకస్మాత్తుగా మీడియాలో కనిపించి రాజకీయంగా యు-టర్న్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
పృథ్వీ తాజా ఇంటర్వ్యూలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. పవన్ తో పాటు మెగా కుటుంబాన్ని ప్రశంసించాడు. అంతేకాదు..పృథ్వీ తన సొంత పార్టీ నాయకులపై తీవ్రంగా ఎదురు దాడికి దిగారు. అక్కసు వెల్లగక్కారు. ఎన్నికల్లో తనని ఉపయోగించుకుని ఆ తరవాత దారుణంగా వెల్లగొట్టారని అన్నారు.
``నాకు జగన్ మోహన్ రెడ్డి పట్ల చాలా గౌరవం అభిమానం ఉన్నాయి. కానీ పార్టీలో నాపై అసూయపడే కొందరు నాయకులు ఉన్నారు. వీళ్లంతా ఎవరు? నేను వారి ముందు సాష్టాంగ పడాల్సిన అవసరం లేదు`` అంటూ పృథ్వీ ఫైరయ్యారు. కోవిడ్ కి చికిత్స పొందుతున్న సమయంలో ఒక్క పార్టీ నాయకుడు కూడా తనని పరామర్శించలేదని వాపోయారు పృథ్వీ. ఎన్నికల్లో తనని కరివేపలా వాడుకుని విసిరేసారని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.
నిజానికి వై.ఎస్.ఆర్.సి ప్రధాన కార్యదర్శిగా ఉన్నందున మాత్రమే పవన్ ని విమర్శించాల్సి వచ్చిందని ఏ ఉద్దేశ్యంతోనూ కాదని పృథ్వీ అన్నారు. ``రాజకీయాల్లో ప్రతి ఒక్కరికీ ఒక రకమైన దురద ఉంటుంది. నా నోటిలో దురద ఉంది. అందువల్ల నేను పవన్ ని విమర్శించాల్సి వచ్చింది`` అని రియలైజేషన్ కనబరచడం ఆసక్తికరం. మెగా బ్రదర్ నాగ బాబు తనతో మాట్లాడటం లేదు. అయితే నాకు సినిమాల్లో అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్- చిరంజీవిలకు కృతజ్ఞతలు చెబుతానని అన్నారు. మెగా ఫ్యామిలీ ముందు బీరాలు పోవడం అంటే హనుమంతుడి ముందు మరగుజ్జు వ్యవహారం లాంటిదని అన్నారు పృథ్వీ. తాజా యూటర్న్ తో అతడికి పార్టీ నుంచి బహిష్కారం ఖాయంగానే కనిపిస్తోందన్న గుసగుసా వినిపిస్తోంది.
Post a Comment