'ఫిల్మ్ ఫేర్' కవర్ పేజీ పై ఢిల్లీ సుందరి సోయగాలు..!! | Rakul Preet Poses On the cover page of Filmfare
సినీ ఇండస్ట్రీలో అందమైన భామలకు కొదవలేదని సంగతి తెలిసిందే. వాళ్ళ అందాల ఆరబోత సినిమాల్లోనే కాకుండా అప్పుడప్పుడు మ్యాగజైన్స్ కవర్ పేజీలపై కూడా కనిపిస్తుంది. తాజాగా ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ అదే పనిచేసింది. ఈ అమ్మడు ఫిల్మ్ ఫేర్ మిడిల్ ఈస్ట్ 2021 అనే కవర్ పేజీ కోసం అదిరిపోయే పోజిచ్చింది. ప్రస్తుతం ఆ కవర్ పేజీలో రకుల్ అందాలను సోషల్ మీడియాలో తెగ ఆస్వాదిస్తున్నారు ఫ్యాన్స్. అన్ని కలర్స్ కలగలిసిన మినీ ఫ్రాక్ లో రకుల్.. ఒక చేయి నడుముకు ఆనించి ఎడమ చేయిని తల పైకిలేపి పోజిచ్చింది. అంతే మినీ ఫ్రాక్ కదా.. అమ్మడి థైస్ చూస్తూ కుర్రగుండెలు అల్లాడిపోతున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో ఇదొక కొత్త ఆరంభం అనే చెప్పాలి. రకుల్ కు కూడా ఈ ఏడాది ఇదే ఫస్ట్ కవర్ పేజీ ఫోటోషూట్. న్యూ బిగినింగ్ అంటూ కాప్షన్ జతచేసిన రకుల్ ఫోటో ప్రస్తుతం నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. తెలుగులో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరిగా రకుల్ కొనసాగుతోంది. ఈ భామ ఇటూ తెలుగు సినిమాలు చేస్తూనే అటూ హిందీ తమిళ సినిమాలను లైన్ లో పెడుతోంది. తన అందచందాలతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొడుతోంది రకుల్. ఇప్పటికే లౌక్యం నాన్నకుప్రేమతో ధృవ లాంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఈమధ్య రకుల్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. రకుల్ వీలున్నప్పడల్లా ఫోటో షూట్లు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. రకుల్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. టాలీవుడ్ లో ఉన్నంతకాలం అందాలు ఆరబోసింది కానీ బాలీవుడ్ కు వెళ్ళాక ఆ బౌండరీ లైన్ కనబడటం లేదు. అడిగిందే ఆలస్యమన్నట్లు అందాలన్నీ మూటగట్టి కెమెరా ముందు పెట్టేస్తుంది. ప్రస్తుతం చెక్ సినిమాలో నటిస్తోంది.
Post a Comment