దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులు ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను https://bank.sbi/careers వెబ్సైట్లో చూడొచ్చు. ముఖ్య సమాచారం:
పోస్టు పేరు: మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్)
అర్హత: ఎంబీఏ లేదా పీజీడీఎం లేదా బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తు చేసుకున్నవారి విద్యార్హతలు, అనుభవాన్ని బట్టి అభ్యర్థులను ఎంపికచేస్తారు. వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజులేదు.
Post a Comment