ఫొటోటాక్ః సాయి పల్లవి మరోసారి మైమరపించడం ఖాయం | Sai Pallavi Role In Virata Parvam
ప్రేమమ్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సాయి పల్లవి తెలుగులో టాప్ హీరోయిన్ గా దూసుకు పోతుంది. సాదారణంగా టాప్ హీరోయిన్స్ కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే ఓకే చెప్తారు. కాని సాయి పల్లవి మాత్రం అలా కాకుండా పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలకు ఓకే చెప్తూ వెళ్తుంది. త్వరలో సాయి పల్లవి రానాతో కలిసి నటించిన విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సాయి పల్లవి లుక్ ను విడుదల చేసిన విరాట పర్వం యూనిట్ సభ్యులు సినిమాపై అంచనాలు మరింతగా పెంచేందుకు సాయి పల్లవి మరో పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ ఫొటోలో సాయి పల్లవి సింపుల్ గా లంగా ఓణి వేసుకుని సైకిల్ తొక్కుకుంటూ వస్తుంది. సాయి పల్లవి లుక్ చూస్తుంటే మరో సారి ఫిదా సినిమాలో భానుమతి మాదిరిగా మైమరపించడం ఖాయం అనిపిస్తుంది. ఫిదా సినిమా వచ్చి ఇన్నాళ్లు అయినా కూడా ఇంకా సాయి పల్లవి పాత్రను ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారు. ఆ పాత్రను మరిపించే విధంగా ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర ఉంటుందని ఈ ఫొటో ను చూస్తుంటే అనిపిస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాయి పల్లవి ఈ సినిమాతో పాటు ఇంకా పలు సినిమాల్లో కూడా నటిస్తుంది. వెబ్ సిరీస్ లపై కూడా ఈమె ఆసక్తి చూపిస్తోంది.
Post a Comment