Header Ads

రెండు సార్లు జైలుకి వెళ్లిన మారని జేసీ తీరు ! పోలీసులకు ఈజీగా టార్గెట్ అవుతున్నారా ?

రెండు సార్లు జైలుకి వెళ్లిన మారని జేసీ తీరు ! పోలీసులకు ఈజీగా టార్గెట్ అవుతున్నారా ?

రెండు సార్లు జైలుకి వెళ్లిన మారని జేసీ తీరు ! పోలీసులకు ఈజీగా టార్గెట్ అవుతున్నారా ?

ఒకసారి తెలిసో తెలియకో చేసిన తప్పునకు జైలుకు వెళ్లి వస్తే.. మరోసారి అలాంటిది జరగకూడదని అనుకుంటారు. కానీ.. ఆయన మాత్రం నా రూటే సపరేట్‌ అంటున్నారు. ఏకంగా రెండుసార్లు జైలుకు వెళ్లివచ్చినా.. తీరు మారలేదట. ముచ్చటగా మూడోసారి కేసు నమోదైంది. రాజకీయవర్గాల్లోనూ చర్చకు కారణమైంది. 

ఇప్పటికే రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చారు

ప్రభాకర్‌రెడ్డి తెలిసి చేస్తున్నారో.. తెలియక చేస్తున్నారో కానీ పోలీసులతో ఢీ అంటే ఢీ అంటున్నారు.  వరుసగా కేసులు పెట్టి జైల్లో వేస్తున్నా JC మారడం లేదు. పోలీసులూ మారడం లేదు. ఇప్పటికే రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చారు ప్రభాకర్‌రెడ్డి. అందులో ఒక కేసు సీరియస్‌ అయితే.. ఇంకొకకటి కోవిడ్‌ నిబంధనల ఉల్లంఘన, CIని దుర్భాషలాడారనే అట్రాసిటీ కేసు. ఈ కేసుల్లో ఇలా జైలు నుంచి  బయటకు వచ్చారో లేదో అలా మర్నాడు సాయంత్రానికి మళ్లీ  జైలులో అడుగు పెట్టాల్సి వచ్చింది. అదీ అయింది అనుకుంటుంటే మళ్లీ మరో కేసు. 

ఇంకొన్ని కేసులే కదా అనుకున్నారా? 

ఇలా JC ఫ్యామిలీ కిక్కురుమంటే చాలు  కేసులు మీద కేసులు పెట్టేస్తున్నారు అనంతపురం పోలీసులు. అయినా ప్రభాకర్‌రెడ్డి మారడం లేదు. కోవిడ్‌ నుంచి కోలుకుని తాడిపత్రి వచ్చిన ప్రభాకర్‌రెడ్డికి ఆయన అనుచరగణం భారీ ఎత్తున స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసింది. ముందురోజే బ్యానర్లు కట్టారు. బాజా భజింత్రాలు రెడీ చేశారు. ఇలా చేస్తే పోలీసులు చూస్తూ ఊరుకుంటారనుకున్నారో లేక పెడితే ఇంకొన్ని కేసులే కదా అనుకున్నారేమో ర్యాలీ షురూ చేశారు. అంతే టపటపా కేసులు రెడీ అయ్యాయి. మళ్లీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు. 

ప్రభాకర్‌రెడ్డి అందరీకి భిన్నంగా వెళ్తున్నారు

పోలీసులకు భయపడితే ఇజ్జత్‌ పోతుందని అనుకున్నారో లేక జైలుకు వెళ్లినా.. ఆస్పత్రికి వెళ్లినా హంగూ ఆర్బాటాలు లేకుండా రీఎంట్రీ ఇవ్వడం తన లెవల్‌ కాదనుకున్నారో ఏమో ప్రభాకర్‌రెడ్డి రూట్‌ మాత్రం మార్చడం లేదు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ తమకు అడ్డే లేదన్న విధంగా ముందుకెళ్లారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో ఒక్కసారిగా సీన్‌ రివర్స్‌ అయింది. గతంలో మంత్రులుగా పనిచేసిన వారే జైలుకు వెళ్తున్నారు. ఇంకొందరు ప్రభుత్వానికి ఛాన్స్‌ ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రభాకర్‌రెడ్డి మాత్రం వారందరికీ భిన్నంగా వెళ్తున్నారు. 

తొలి కేసులో ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్‌ ఓ సంచలనం!

కేసులన్నీ కక్ష సాధింపు చర్యగా టీడీపీ ఆరోపిస్తున్నా.. అందుకు తగిన ఆధారాలు చూపిస్తున్నారు పోలీసులు. BS 3 వాహనాలను కొనుగోలు చేసి వాటిని BS 4గా మార్చి విక్రయించారని ప్రభాకర్‌రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసి.. అనంతపురం తీసుకొచ్చి.. చివరకు కడప జైలుకు తరలించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాజకీయాల్లో సంచలనం రేపింది. 

జైలులో ఉండగానే కరోనా బారినపడ్డ ప్రభాకర్‌రెడ్డి

రెండోసారి జైలుకు వెళ్లిన కొద్ది రోజులకే కడప జైల్లో కరోనా కలకలం రేపింది. ఖైదీలకు టెస్టులు చేయించగా.. చాలా మందికి పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో ప్రభాకర్ రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రభాకర్ రెడ్డి అటు నుంచి అటే హైదరాబాద్ వెళ్లారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత హైదరాబాద్‌లో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఇటీవలే తాడిపత్రికి తిరిగివచ్చారు. ఇక్కడే మరోసారి బుక్‌ అయ్యారు. ప్రభాకర్‌రెడ్డి పోలీసులకు ఈజీగా టార్గెట్ అయిపోయితున్నారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. తనదైన స్టయిల్‌తో తెగించేశారనే గుసగుసలకు ఆయన ఆస్కారం ఇస్తున్నారు. మరి.. ఈ  కేసుల పర్వం ఎంత దూరం వెళ్తందో చూడాలి. 

No comments

Powered by Blogger.