ముడతలకు చికిత్స చేస్తే.. ముఖానికి పక్షవాతం వచ్చింది, పాపం మహిళ!
ఎప్పటిలాగానే ముఖానికి ఫిల్లర్ ఇంజక్షన్ చేయించుకున్న ఆమె.. వారం రోజుల తర్వాత ముఖంలో మార్పులు రావడం గమనించింది. ఈ ఏడాది సెప్టెంబరు 19న.. ఆమె ముఖంలో ఎడమ వైపు భాగం పూర్తిగా కుచించుకుపోయి ముఖ పక్షవాతం (Face Paralysis) ఏర్పడింది. ఉదయం నిద్రలేచే సమయానికి ఆమె మూతి పక్కకు వెళ్లిపోయింది. ఎడమ కంటితోపాటు నోటిని పూర్తిగా మూయలేకపోయింది. దీంతో ఆహారం కూడా నమల లేక ఇబ్బంది పడుతోంది. కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటోంది.
Read Also: భోజనం తర్వాత శృంగారం చేయొచ్చా? ఎలాంటి సమస్యలు వస్తాయి?
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రోజు నా ముఖాన్ని అద్దంలో చూసుకుంటుంటే చాలా బాధ వేస్తోంది. చనిపోవాలనిపిస్తోంది. చికిత్స కోసం చాలా హాస్పిటళ్లకు వెళ్లాను. దీనికి ఫేషియల్ నర్వ్ పరాలసిస్ చికిత్ అందించాలని చెబుతున్నారు. కానీ, అది ఎన్ని రోజుల్లో నా ముఖానికి సాధారణ స్థితి తెస్తుందనే విషయాన్ని మాత్రం చెప్పలేకపోతున్నారు. ఆ హాస్పిటల్ అంతకు ముందు వేరే డాక్టర్ చికిత్స చేసేవారు. చివరికిగా ఫిల్లర్ ఇంజక్షన్ తీసుకొనేప్పుడు ఆ డాక్టర్‌కు బదులు వేరే డాక్టర్ ఇంజక్షన్ చేసింది. ఆమె తప్పిదం వల్లే నాకు ఈ పరిస్థితి ఏర్పడింది’’ అని తెలిపింది.
ఈ నేపథ్యంలో బాధితురాలు ఆ కాస్మోటిక్ హాస్పిటల్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు జరిగిన నష్టానికి ఆ హాస్పిటల్ పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేస్తోంది. అయితే, కాస్మోటిక్ ఫిల్లర్ల వల్లే ఆమెకు ఈ సమస్య వచ్చిందనే విషయాన్ని వైద్యులు రిపోర్టుల్లో చెప్పలేదని, అందుకే ఆమెకు పరిహారం చెల్లించడం హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించింది. నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆమెకు ముఖం సాధారణ స్థితికి చేరడానికి నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చని లేదా శాస్వతంగా అలాగే ఉండిపోవచ్చని అంటున్నారు. చూశారా.. అందంగా ఉండాలనే తపన ఆమెకు ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. కాబట్టి.. సున్నితమైన ముఖానికి ఏదైనా చికిత్స చేయించుకొనే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించాలి.
Post a Comment