ధోని కూతురికి అత్యాచార బెదిరింపులు...
గత ఏడాది ప్రపంచ కప్ తర్వాత నుండి క్రికెట్ కు దూరంగా ఉన్న మహేంద్రసింగ్ ధోని ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఆ తర్వాత గత నెల 19న యూఏఈ వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ 2020 లో ప్రస్తుతం ఆడుతున్నాడు. కానీ ఈ ఐపీఎల్ సీజన్ లో ధోని పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ 13వ సీజన్ లో 6 మ్యాచ్ లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. అయితే చెన్నై చివరగా కోల్కత నైట్ రైడర్స్ తో తలపడి 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఈ ఓటమి తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో ధోని కుటుంబం కు సంబంధించి అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. అందులో మరి కొంతమంది ధోని 5 సంవత్సరాల కూతురు అయిన జీవా ధోనికి సంబంధించి అత్యాచార బెదిరింపులకు పాల్పడుతునారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని కలిగించిన హత్రాస్ సంఘటన నేపథ్యంలో, ఇటువంటి పోస్ట్స్ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అలాగే ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. దాంతో చాలా మంది ధోని అభిమానులు అలాగే ప్రజలు ఇటువంటి అసభ్యకర పోస్ట్స్ పెడుతున్నవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Post a Comment