Header Ads

ఫోటో స్టోరి: ఆ `థై`షోలేమిటి మల్హోత్రాజీ? | Sanya Malhotra Latest Stunning Pose

 Sanya Malhotra Latest Stunning Pose

ఒకే ఒక్క వెబ్ సిరీస్ తో ఆ కుర్రబ్యూటీ పేరు ఇండస్ట్రీ సర్కిల్స్ తో పాటు ఇంటా బయటా మార్మోగింది. ఆ సిరీస్ లో వేడెక్కించే బెడ్ రూమ్ సన్నివేశంలో జీవించి ఒక్కసారిగా ఫాలోవర్స్ ని పెంచుకుంది. `సెక్స్ టేప్ వీడియో లీక్` కాన్సెప్టులో జీవించిన ఈ అమ్మడి పేరు సన్యా మల్హోత్రా. లుడో - నెట్ ఫ్లిక్స్ సిరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్ తో వేడెక్కించే రొమాన్స్ తో అదరగొట్టింది.

లూడోలో ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి లవ్ మేకింగ్ సన్నివేశాల గురించి చెబుతూ సన్యా ఎంతో ఎగ్జయిట్ అయ్యింది అప్పట్లో. అంతటి అందగాడితో బెడ్ రూమ్ లో సన్నివేశాలు అంటే చాలా ఇదిగా అనిపించింది. కానీ నాలానే నా ఫ్రెండ్స్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు! అంటూ కవ్వించే ఇంటర్వ్యూతో మతులు చెడగొట్టింది. లూడోలో మల్హోత్రా-ఆదిత్య రాయ్ కపూర్ ప్రేమికులుగా కనిపించారు.
అనురాగ్ బసు ఈ సిరీస్ కి దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు.

``ఆదిత్య రాయ్ చాలా మంచి నటుడు.. నా దేవుడు.. అతను చాలా అందగాడు..ఇంత మంచి నటుడు ఇంత అందమైన వ్యక్తితో కలిసి పనిచేయడానికి ఎవరు సంతోషంగా ఉండరు? నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. నాలానే నా స్నేహితులు సంతోషంగా ఉన్నారు`` అంటూ ఆనందం వ్యక్తం చేసింది సన్యా.

సెక్స్ టేప్ ఆన్ లైన్ లో లీక్ అయిన మాజీ ప్రేమికులుగా ఈ జంట నటించారు. మరొక వ్యక్తితో ఆమె పెళ్లికి కొన్ని రోజుల ముందు దాన్ని తొలగించాలని వారు ఒక మిషన్ ను ఎంచుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ఈ సిరీస్ కథాంశం. ఇందులో  సెక్స్ సన్నివేశాలను చిత్రీకరించడం గురించి అడిగినప్పుడు సన్యా ఏమన్నారంటే.. “స్క్రిప్ట్ కు ఈ సన్నివేశాలు అవసరమైతే.. నేను దాన్ని పట్టించుకోను. కానీ ఆ సన్నివేశాల షూటింగ్ విషయంలో కొంత సంకోచం భయం.. ఎందుకంటే మన చుట్టూ చాలా మంది ఉంటారు. లైట్లు కెమెరాలు నన్ను మరింత భయపెట్టాయి`` అని సన్య చెప్పారు.

అన్నట్టు సన్యాకి సోషల్ మీడియాల్లోనూ విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. సన్య లేటెస్టు ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇక ఇందులో కార్పొరెట్ లుక్ థై షోస్ అగ్గి రాజేసాయి. మరీ అంతగా చెలరేగాలా మల్హోత్రాజీ అంటూ కుర్రాళ్ల కామెంట్లు వేడెక్కించేస్తున్నాయ్. సన్నివేశం డిమాండ్ మేరకు మాత్రమే సన్య అలా ఫోజులిచ్చిందంతే.

No comments

Powered by Blogger.