Header Ads

రూ.12 కోట్ల మూవీ 12 లక్షల వసూళ్లు.. కరెంట్ బిల్లు కూడా రాలేదు | Master Collections In Bollywood Industry

 Master Collections In Bollywood Industry

తమిళ సూపర్ స్టార్ విజయ్ కు ఉత్తర భారతంలో ఘోర పరాభవం ఎదురైంది. ఈయన నటించిన మాస్టర్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. అయితే చాలా కాలం తర్వాత పెద్ద సినిమా విడుదల అయిన కారణంగా తమిళ సినీ ప్రేక్షకులు మాస్టర్ పై కోట్లు కురిపించారు. కాని వేరే చోట మాత్ర పరిస్థితి వేరేలా ఉంది. మరీ ముఖ్యంగా ఉత్తరాదిన మాస్టర్ దారుణమైన వసూళ్లను నమోదు చేసింది. విజయ్ పరువు పోయేలా ఆ లెక్కలు ఉన్నాయి. కనీసం కరెంటు బిల్లుల మందం అయినా వసూళ్లు నమోదు అవ్వని పరిస్థితి అంటున్నారు.

బాలీవుడ్ ట్రెడ్ విశ్లేషకుడు.. సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ స్పందిస్తూ మాస్టర్ సినిమా ప్రదర్శించిన థియేటర్ల ఉద్యోగులు మరియు ఇతర ఖర్చులను పక్కకు పెడితే కనీసం కరెంటు బిల్లు కు సరిపోయే అమౌంట్ ను కూడా రాబట్టలేక పోయాడు అంటూ కామెంట్ చేశాడు. విజయ్ మాస్టర్ మూవీ ఉత్తర భారతంలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటూ 12 కోట్ల రూపాయలు వసూళ్లు చేయాల్సి ఉంది. కాని మొదటి రోజు కేవలం 6 లక్షల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇప్పటికే చాలా థియేటర్ల నుండి తొలగించారు. 12 కోట్ల మూవీ 12 లక్షలు అయినా వసూళ్లు చేసే పరిస్థితి లేకుండా పోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదని బయ్యర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments

Powered by Blogger.