ప్రొడ్యూసర్ ని మర్చిపోయిన నమ్రత.. మహేష్ కి తెలిసేలా ట్వీట్ చేసిన నిర్మాత..! | MS Raju Hurt On Namrata Instagram Post
టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన సీనియర్ ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు.. చాలా గ్యాప్ తర్వాత ఈ మధ్యనే దర్శకుడిగా 'డర్టీ హరి' అనే సినిమాతో వచ్చాడు. వాస్తవానికి నిర్మాతగా ఎమ్.ఎస్ రాజు హవా నడిచిన రోజుల్లో ఆయన బ్యానర్ లో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు కూడా పిలిచి మరీ డేట్స్ ఇచ్చేవారని చెప్పుకునేవారు. ప్రస్తుతం స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న చాలామంది హీరోలతో ఎమ్మెస్ రాజు సూపర్ హిట్ సినిమాలు తీసాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ''ఒక్కడు'' సినిమాను కూడా ఆయనే నిర్మించారు. మహేశ్ బాబు కెరీర్ నే మలుపు తిప్పిన సినిమా 'ఒక్కడు' సినిమా రిలీజై 18 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్మాత ఎమ్.ఎస్ రాజు ని మర్చిపోయినట్లు తెలుస్తోంది.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఒక్కడు' సినిమా శుక్రవారంతో 18 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మహేష్ సతీమణి నమ్రత తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్టు పెట్టింది. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపిన నమ్రత.. అందులో అందరి పేర్లు మెన్షన్ చేసి నిర్మాత ఎంఎస్ రాజును మర్చిపోయింది. అయితే ఆమె పొరపాటున ఎమ్.ఎస్ రాజు పేరును మర్చిపోయారా లేదా కావాలనే విస్మరించారా అనే విషయం పక్కనపెడితే.. ఇది మాత్రం నిర్మాతను బాగా హర్ట్ చేసిందట. నేటి స్టార్ హీరోలుగా ఉన్నవారికి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన తన లాంటి సీనియర్ ప్రొడ్యూసర్లనే మర్చిపోతే ఇక మాములు నిర్మాతలు సంగతి దేవుడెరుగని.. హీరోలు తనను మర్చిపోయినా హీరోయిన్లు మాత్రం తనను గుర్తు చేసుకున్నారని తన సన్నిహితులు దగ్గర ఎమ్ ఎస్ రాజు వాపోతున్నారట.
అయితే ఎమ్మెస్ రాజు ఈ విషయం మహేశ్ బాబుకి తెలిసేలా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''మిస్టేక్స్ జరుగుతుంటాయి బాబు.. నమ్రత గారు ఒక్కడు సినిమా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్టులో నా పేరును పెట్టడం మర్చిపోయినప్పటికీ ఇది ఆమె క్లాసిక్ సినిమా అని చెప్పినందుకు సంతోషంగా ఉంది.. గుడ్ లక్'' అని రాజు ట్వీట్ చేసాడు. దీనికి మహేష్ బాబుని ట్యాగ్ చేసాడు. ఇటీవలే ప్రభాస్ కూడా మహేశ్ మాదిరిగానే ఎంఎస్ రాజు గురించి మర్చిపోయి తన 'వర్షం' సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం. ఇకపోతే మంచి స్క్రిప్ట్ దొరికితే 'ఒక్కడు' సీక్వెల్ చేస్తానని ఎమ్మెస్ రాజు ఇటీవల ఓ నెటిజన్ కి సమాధానం ఇచ్చాడు.
Post a Comment