మెగా డాటర్ జంటకు కరోనా టెస్ట్స్ చేసారా..?? | Niharika Chaitanya Couple Tested Negitive
మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్యతో కలిసి హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ కొత్త జంట ఎంజాయ్ చేస్తూ సెల్ఫీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. నిహారిక ఎంగేజ్మెంట్ దగ్గర నుండి మొదలుపెడితే పెళ్లి హనీమూన్ అంటూ ఇప్పటికి వార్తలలో నిలుస్తూనే ఉంది. అయితే ఇటీవలే మెగా హీరోలు రాంచరణ్ వరుణ్ తేజ్ లకు కోవిడ్ పాజిటివ్ వచ్చిన విషయం స్వయంగా వారే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అప్పటి నుండి మెగా డాటర్ పెళ్ళికి హాజరైన వారి పరిస్థితి ఏంటా.. అని ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు మెగా అభిమానులు. అంతేగాక రాంచరణ్ వరుణ్ లకు కోవిడ్ పాజిటివ్ అనగానే చాలా కంగారు పడ్డారు.
మరి కొత్తగా పెళ్ళైన దంపతుల సంగతి ఏమిటా.. రాంచరణ్ వరుణ్ లకు పాజిటివ్ వచ్చిందంటే పక్కా మెగా డాటర్ నిహారిక దంపతులకు కూడా ఉండే ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం పై నిహారిక తండ్రి నాగబాబు స్పందించడం జరిగింది. అంతేగాక హనీమూన్ ముందే నిహారిక చైతన్యలకు కరోనా టెస్టులు నిర్వహించడం జరిగిందని.. ఇద్దరికీ నెగటివ్ వచ్చాకే మాల్దీవ్స్ వెళ్లడానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపాడు. అలాగే వెళ్లే ముందు మరోసారి టెస్టులు చేసినట్లు చెప్పుకొచ్చాడు నాగబాబు. ఎందుకంటే ఒకవేళ నిహారిక చైతన్యలకు ఉంటే గనక పెళ్ళికి హాజరైన వారి సంగతేంటి అంటున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా.. నాగబాబు న్యూ ఇయర్ సందర్బంగా బిగ్ బాస్ 4 లో పాల్గొన్న వారికీ స్ట్రాంగ్ పార్టీ ఇచ్చాడట. అంతేగాక మెగా డాటర్ గురించి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి సందేహం ఉన్నవాళ్లకు క్లారిటీ ఇచ్చాడు.
Post a Comment