Header Ads

'వి' మూవీ విషయంలో హీరోకి అన్యాయం జరిగిందా..?? | Was there any injustice to the hero in the case of V movie


 

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సినిమా 'వి'. క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నివేద థామస్ అతిథి రావు హైదరిలు హీరోయిన్లుగా నటించారు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని విలనిజం నిండిన హీరోయిక్ పాత్ర చేయడం విశేషం. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసరుగా కనిపించాడు. మొన్నటి వరకు లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఓటిటిలే సినిమా థియేటర్లుగా మారాయి. చిన్నసినిమా పెద్దసినిమా అనే తేడా లేకుండా దొరికిన సినిమాలన్నింటిని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ బేరం కుదుర్చుకొని ఓటిటిలో ప్రదర్శిస్తున్నాయి. అయితే నిర్మాత దిల్ రాజు 'వి' సినిమాకు అమెజాన్ ప్రైమ్ నుండి భారీమొత్తంలోనే పుచ్చుకున్నాడు. ఎన్నో అంచనాల మధ్య వి సినిమా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది.


అయితే సినిమా ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే..  ఇప్పుడు వి సినిమాను థియేటర్లలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట నిర్మాత. ఓటిటిలోనే వి సినిమా జనాలకు రీచ్ అవ్వలేదు. అలాంటిది థియేటర్లలో రిలీజ్ చేస్తే ఇంకేం చూస్తారు. అది కూడా సెప్టెంబర్ లో విడుదలైన మూవీని ప్రస్తుతం 50% సీటింగ్ సిస్టంలో రిలీజ్ చేస్తే అంతే. ఓటిటిలో విడుదల చేసిన సినిమాలను థియేటర్లలో ఆడియెన్స్ మళ్లీ చూసే అవకాశాలు చాలా తక్కువ అని ఓ వైపు సినీ నిపుణులు చెబుతూనే ఉన్నారు. మరో వైపు డిస్ట్రీబ్యూషన్ వర్గాలు మాత్రం పెద్ద హీరోల సినిమా ఓటిటిలో డైరెక్ట్ రిలీజైన పర్వాలేదు.. థియేటర్లలో విడుదల చేస్తే థియేటర్ ఫీడింగ్ కోసమైనా పనికొస్తాయనే ఉద్దేశంతో విడుదల చేయచ్చని అంటున్నారు. అయితే చిన్న హీరోలే వెయిట్ చేసి మరీ థియేటర్స్ కోసం చూస్తుంటే.. హీరో నాని వి విషయంలో దారుణం జరిగిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ మొత్తానికి దిల్ రాజు థియేటర్లకు నాని వి సినిమా ఫీడింగ్ కంటెంట్ గా మారిపోయిందా.. అంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో..!!

No comments

Powered by Blogger.