#2020 సామ్ జూమ్.. హాటెస్ట్ బ్యూటీ ఆఫ్ ద ఇయర్ | Samantha Latest pic goes viral
ఏడాది అంతా ఒకెత్తు.. ముగింపు ఇంకో ఎత్తు. ఇక గోవా బీచ్ సెలబ్రేషన్ అంటే మామూలుగా ఉంటుందా? మొన్న మాల్దీవుల నుంచి అంతగా వేడెక్కించే ఫోటో ఏదీ రివీల్ కాలేదు కానీ.. ఈసారి గోవా నుంచి ట్రీట్ అదిరింది
అక్కినేని నాగచైతన్య - సమంత జంట చిలౌట్ ఏ రేంజులో ఉందో ఇదిగో ఈ ఫోటో చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇంతకుముందే హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గోవా ట్రిప్ వెళుతున్న ఫోటోలు రివీలవ్వగా.. ఇప్పుడు ఎగ్జోటిక్ గోవా రిసార్ట్ నుంచి వేడెక్కించే ఫోటోనే షేర్ చేసింది అక్కినేని బృందం.
ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి చై-సామ్ జంట అదిరిపోయే ఫోజిచ్చింది. ఇక ఇందులో సామ్ నెవ్వర్ బిఫోర్ అనేంత హాట్ గా కనిపిస్తోంది. ఇటీవలే ఓ కమర్షియల్ ప్రకటన కోసం సామ్ హాటెస్ట్ అవతార్ లో కనిపించింది. కానీ ఇప్పుడు అంతకుమించి అనిపించేలా థై సొగసుల్ని ఎలివేట్ చేసింది. ఇక ఈ ఫోటోలోనే ఫ్యామిలీ ఫ్రెండు అయిన శిల్పారెడ్డి ఫ్యామిలీ కూడా కనిపిస్తున్నారు. నేటి (31 డిసెంబర్) మిడ్ నైట్ ట్రీట్ ఇంకే రేంజులో ఉండనుందో? కొత్త సంవత్సరానికి వెల్ కం చెబుతూ గోవా బీచ్ లో పార్టీ పీక్స్ చేరుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.
Post a Comment