ఫోటో స్టోరి: హంస థైతక్కల తళుకుబెళుకులు | Hamsa Nandhini Latest Instagram Pics Goes Viral
గత కొంతకాలంగా అందాల హంసానందిని ఇన్ స్టా ట్రీట్ అంతకంతకు హీట్ పెంచుతోంది. నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో విరుచుకుపడుతూ ఈ వేదికపై భారీగా ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. కొద్ది రోజులుగా రకరకాల వంటకాలపై టిప్స్ చెబుతూ నోరూరించేస్తున్న హంస వీనుల విందైన పసందైన ట్రీట్ కోసం ఇన్ స్టాలో తనను అనుసరించాలని కోరింది.
తాజాగా కేరళ - మున్నార్ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ గా హంస చేస్తున్న ప్రమోషన్ చూస్తుంటే భారీగానే ప్యాకేజీ ముట్టిందని అర్థమవుతోంది. మున్నార్ పచ్చందాల నడుమ హంస అందచందాల ఫోటోషూట్ మైమరిపిస్తోంది. దీనికి ఆసక్తికరమైన వ్యాఖ్యానాన్ని హంస జోడించింది.
``కేరళ .. స్వాన్ స్టోరీ మనందరినీ రంజింపజేస్తుంది. మున్నార్ పచ్చందాల మధ్యకు మనల్ని తీసుకువెళుతుంది. ఈ ఎపిసోడ్లో నేను మున్నార్ లో అందంగా అలంకరించబడిన టీ తోటలను అన్వేషిస్తాను. అక్కడ నేను స్థానికులను కలుస్తాను. పాదయాత్రకు వెళ్తాను. సూర్యోదయంలో ఫోటోషూట్ చేస్తాను. మున్నార్ కి డ్రైవ్ ఒక వాస్తవిక కల!`` అంటూ ఉబ్బితబ్బిబ్బయ్యింది.
ఇక ఈ వీడియో తో పాటు తను షేర్ చేసిన థై సొగసుల ఫోటోలు అంతే వైరల్ గా మారాయి. స్విమ్ సూట్ లో హంసానందిని హాట్ లుక్ తో కవ్విస్తోంది. పూణేకి చెందిన టాప్ మోడల్ కం నటిగా హంసానందిని టాలీవుడ్ కి సుపరిచితం. జగపతిబాబు.. నాగార్జున లాంటి స్టార్లు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేశారు. హంస ఐటెమ్ నంబర్లతోనూ పాపులరైంది. దశాబ్దానికి పైగా టాలీవుడ్ తెరపై తన ఉనికిని చాటుకుంది. ప్రస్తుతం కెరీర్ పరంగా అంత పెద్ద ప్రాజెక్టులేవీ లేవు. 2021 అయినా హంసకు కలిసొస్తుందేమో చూడాలి.
Post a Comment