ఈ పెళ్లి కుమార్తె పిచ్చపై నెటిజన్లు ఫైర్.. అయినా ఓకే అన్నోళ్లు ఉన్నారట | Netizens fire on the madness of this bride
పుర్రెకో బుద్ధి.. జిహ్వాకో రుచి అన్న మాట ఊరికే అనలేదు మన పెద్దోళ్లు. సోషల్ మీడియా పుణ్యమా అని.. ప్రపంచంలోని ఏ మూలన ఏ సిత్రమైన ఉదంతాలు చోటు చేసుకున్నా.. నిమిషాల వ్యవధిలో అందరికి షేర్ కావటమో.. వైరల్ అవ్వటమో జరిగిపోతోంది. ఇప్పుడు చెప్పబోయే పెళ్లి కుమార్తె గురించి మొత్తం వివరాలు తెలిస్తే నోటి వెంట మాట రాకపోగా.. ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అన్న సీరియస్ డౌట్ రాక మానదు.
ఇంతకీ ఈ పెళ్లి కుమార్తె ఏం చేసింది? అన్న ప్రశ్నలోకి వెళితే.. కాబోయే పెళ్లి కుమార్తె సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. బ్రేడ్స్ మేడ్ కండీషన్ లిస్టు పేరుతో కొన్ని తలతిక్క కండిషన్లు పెట్టింది. తనను పెళ్లి కుమార్తెను తయారు చేసే రోజు.. మిగిలిన వారందరిని ఎలా చూసుకోవాలన్న విషయంపై కొన్ని నిబంధనల్ని తయారు చేసి.. అందరికి పంపింది. అందులో 37 నియమాలు ఉండటం గమనార్హం.
సదరు పెళ్లికుమార్తె పెట్టిన కండిషన్లు చూస్తే.. ఒళ్లు మండిపోయేలా చేస్తోంది. తనకు తోడు పెళ్లి కుమార్తెలుగా వ్యవహరించే యువతి తనను పెళ్లి కుమార్తెగా సిద్ధం చేసే వేళలో ప్రెగ్నింగ్ రాకూడదని.. తనకు తోడుగా ఉండే వారు బరువు తగ్గకూడదని రూల్ పెట్టేసింది.
అంతేకాదు.. తోడు పెళ్లి కుమార్తెగా వచ్చే వారు ఏమేం బట్టలు వేసుకోవాలి? ఏ రంగు దుస్తులు ధరించాలి? పెళ్లికి వచ్చే మగాళ్లకు సైట్ కొట్టకూడదని.. అదే సమయంలో పెళ్లికి వచ్చిన వారిని సంతోషంగా ఉంచాలని పేర్కొంది. తనకు తోడు పెళ్లి కుమార్తెగా వ్యవహరించే వారు పెదాలకు.. గోళ్లకు.. తలకు రంగురంగుల లిప్ స్టిక్.. పాలిష్.. కలర్స్ వేసుకోకూడదని స్పష్టం చేసింది. ఈ లిస్టు బయటకు రావటం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన పలువురు నెటిజన్లు.. సదరు పెళ్లి కుమార్తె పిచ్చను తిట్టిపోస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇన్ని కండీషన్లు పెట్టిన తర్వాత కూడా పలువురు మహిళలు తోడు పెళ్లికుమార్తెకు తోడు ఉంటామని ఓకే చెప్పేయటం గమనార్హం.
Post a Comment