ఫైటర్ బ్యూటీ అన్ లిమిటెడ్ బికినీ ట్రీట్ | Ananya Pandey Latest Stunning Pose
మాల్దీవుల పర్యటనలో బాలీవుడ్ యంగ్ కపుల్స్ సందడి తెలిసినదే. ఎవరికి వారే యమునా తీరే.. ఒకరికొకరు సంబంధం లేదు! అంటూ కలరింగ్ ఇచ్చినా జంటగా విమానాశ్రయాల్లో పట్టుబడడంతో ఈ హాటెస్ట్ కపుల్స్ పై ముంబై మీడియా వేడెక్కించే కథనాలను వెలువరించింది.
తాజాగా ముంబై విమానాశ్రయంలో ఇషాన్ ఖట్టర్ - అనన్య పాండే జంటగా కలిసి కనిపించారు. వెళ్లేప్పుడే ఇలా జంటగా కనిపించడమే గాక.. అనన్య ఒంటి పై ఈగ వాలనివ్వనంతగా గార్డ్ లా వ్యవహరించాడు ఇషాన్. దీంతో ముంబై మీడియా స్పెక్యులేషన్స్ అంతే ఇదిగా పరాకాష్టకు చేరాయి. ఇక ఈ జంట మధ్య కేవలం స్నేహమేనా.. ప్రేమాయణమా? అన్నదానికి ఇంకా స్పష్ఠత రావాల్సి ఉంది. బాలీవుడ్ లో ఫేజ్ 3 ఫ్యామిలీస్ మధ్య ఇలాంటివి చాలా సహజంగా చూసేవే కాబట్టి లవ్ ని అధికారికంగా ఖాయం చేయాల్సి ఉంటుంది.
ఈ యువజంట డేటింగ్ చేస్తున్నారా? అంటూ ప్రస్తుతానికి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. జంటగా ఇద్దరూ కలిసి విహారయాత్రను ఆస్వాదించారు. కానీ ఒకరితో ఒకరు ఫోటోలను పోస్ట్ చేయకుండా దాచేశారేం? అంటూ ప్రశ్నలు హీటెక్కిస్తున్నాయి. ఇప్పటివరకూ తమపై వచ్చిన పుకార్లకు ఆజ్యం పోస్తూ మాల్దీవుల నుంచి ఆదివారం సాయంత్రం ముంబై విమానాశ్రయంలో జంటగా దిగిపోవడంతోనే ఈ రుబాబ్ అంతా.
విమానాశ్రయం నుండి యువజంట ఫోటోలను చూసిన ఒక అభిమాని సామాజిక మాధ్యమాల్లో.. “ఓంగ్ ... ఇషన్య” అని కామెంట్ ని పోస్ట్ చేశారు. “నిజంగా ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారా ??” అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇన్స్టా గ్రామ్ లో తమ ట్రిప్ నుండి రెగ్యులర్ చిత్రాలను పంచుకుంటున్నారు. వీటికి స్పందనలు అంతే హీటెక్కిస్తున్నాయి. తాజాగా అనన్య షేర్ చేసిన స్పెషల్ బికినీ ఫోటో అంతే హాట్ టాపిక్ గా మారింది. టూపీస్ ని కవర్ చేస్తూ పైన పేలికల కవరింగ్ ఏమిటా? అంటూ బోయ్స్ ఒకటే కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఖలీ పీలీలో అనన్య - ఇషాన్ జంటగా కలిసి నటించారు. ఈ చిత్రానికి మక్బూల్ ఖాన్ దర్శకత్వం వహించారు. అనన్య తదుపరి శకున్ బాత్రా చిత్రంతో పాటు.. విజయ్ దేవరకొండ- పూరీతో ఫైటర్ మూవీలోనూ నటిస్తోంది.
Post a Comment