విజువల్ ట్రీట్ లా 'నువ్వే నువ్వే' వీడియో సాంగ్..! | Nuvve Nuvve Video Song
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని డ్యూయల్ రోల్ పోషించిన తాజా చిత్రం ''రెడ్''. ఇది తమిళ్ లో సూపర్ హిట్ అయిన 'తడమ్' స్టోరీ లైన్ తో రూపొందింది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ ని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై 'స్రవంతి' రవికిషోర్ నిర్మించారు. ఇందులో రామ్ సరసన మాళవిక శర్మ - నివేథ పేతురాజ్ - అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటించారు. హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ లో నర్తించింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను చిత్రబృందం ముమ్మరం చేసింది. ఇటీవలే 'రెడ్' ట్రైలర్ మరియు 'డించక్' అనే ఐటమ్ సాంగ్ ని విడుదల చేయగా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'రెడ్' నుంచి ‘నువ్వే నువ్వే’ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు.
నిజానికి 'నువ్వే నువ్వే..' లిరికల్ వీడియో ముందే విడుదల చేయబడి మిలియన్ల కొలదీ వ్యూస్ దక్కించుని సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలో ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియో సాంగ్ కూడా ఆకట్టుకుంటోంది. సంగీత బ్రహ్మ మణిశర్మ అందించిన అద్భుతమైన ట్యూన్ కి సీనియర్ లిరిక్ రైటర్ సీతారామ శాస్త్రి అర్థవంతమైన సాహిత్యం అందించారు. రమ్య బెహరా - అనురాగ్ కులకర్ణి కలిసి ఆకట్టుకునేలా ఆలపించారు. ఫారిన్ లోకేషన్స్ లో తెరకెక్కించిన ఈ సాంగ్ చాలా రిచ్ గా విజువల్ ట్రీట్ లా కనిపిస్తోంది. దీనికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఇందులో మాళవిక శర్మ - రామ్ ల మధ్య కెమిస్ట్రీ.. సింపుల్ స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిత్ర టీజర్ - ఫస్ట్ లుక్ - ట్రైలర్ లతో సినిమాపై అంచనాలను పెంచేసిన మేకర్స్.. ఇప్పుడు మరోసారి 'నువ్వే నువ్వే' సాంగ్ తో అలరించారు.
Post a Comment