ఇప్పుడామె రెజీనా కాదు.. శూర్పణఖ! | Regina Cassandra role in Soorpanagai
హీరోయిన్ రెజీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో చాలా సినిమాలే చేసిన ఈ అమ్మడికి.. ఆశించినంత గుర్తింపు మాత్రం రాలేదు. రవితేజ లాంటి సీనియర్ హీరోలతోపాటు సాయి ధరమ్ తేజ్ నాగ శౌర్య లాంటి కుర్ర హీరోలతోనూ ఆడిపాడింది. అయినప్పటికీ.. రెజీనా జాతకం మారలేదు.
ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో ఐటం సాంగ్ చేసే ఆఫర్ అందుకుంది రెజీనా. ఈ మధ్యే చిరుతో కలిసి స్టెప్పులు కూడా వేసింది ఈమె. ఈ వయసులో కూడా మెగా స్టెప్పులు చూసి తనకు మైండ్ బ్లాక్ అయిపోయిందని చెప్పింది ఈ బ్యూటీ. కాగా.. అడవి శేష్ నటించిన ‘ఎవరు’ సినిమా తర్వాత ఈ అమ్మడు పెద్దగా సినిమాలు చేయలేదు. అయితే.. తాజగా శూర్పణఖగా మరి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రెజీనా.
ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తోంది రెజీనా. ఈ సినిమాకు తెలుగులో ‘నేనేనా’ అనే టైటిల్ ఖరారు చేయగా.. తమిళంలో ‘శూర్పణగై’ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రెజీనా పురావస్తు శాస్త్రవేత్తగా నటిస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమా సాగుతుందని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందనే ధీమాతో ఉంది చిత్రయూనిట్. మరి సాలిడ్ సక్సెస్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రెజీనా.. ఈ సినిమాతోనైనా మంచి హిట్ సొంతం చేసుకుంటుందా లేదా అన్నది చూడాలి.
Post a Comment