Header Ads

శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. భారీగా పడిపోయిన వెండి!



బంగారం ధర పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. పెరుగుతూ వచ్చిన పసిడి ఈరోజు వెలవెలబోయింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపించింది.


పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు తగ్గింది. దీంతో పసిడి పెరుగుదలకు అడ్డుకట్ట పడింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర భారీగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగిరావడంతో దేశీ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపించిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గింది. రూ.51,270కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.100 క్షీణతతో రూ.47,000కు దిగొచ్చింది.

బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఏకంగా రూ.1,700 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.72,000కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.02 శాతం తగ్గుదలతో 1870 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.18 శాతం క్షీణతతో 25.48 డాలర్లకు పడిపోయింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

No comments

Powered by Blogger.