ఆధార్ గుడ్ న్యూస్.. ఇక ఇంట్లో నుంచే పుట్టిన తేదీ, పేరు, అడ్రస్ మార్చుకోవచ్చు!
మీ ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయా? అయితే మీరు ఎక్కడికీ వెళ్లకుండానే ఈ తప్పులను సరిచేసుకోవచ్చు. యూఐడీఏఐ మళ్లీ ఆన్‌లైన్ కరెక్షన్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఆధార్ కార్డు ఉందా? అయితే ఇందులో తప్పులు ఉన్నాయా? దీని కోసం మీరు వివరాలను మార్చుకోవాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. యూఐడీఏఐ తాజాగా ఆధార్ కార్డ్ కలిగిన వారికి తీపికబురు అందించింది. పుట్టిన తేదీ, పేరు, అడ్రస్, జెండర్ వంటి వాటిల్లో తప్పులు ఉంటే వాటిని ఇకపై ఇంట్లో కూర్చొనే అప్‌డేట్ చేసుకోవచ్చు.
దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. దీంతో చాలా మందికి బెనిఫిట్ కలుగనుంది. యూఐడీఏఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. గతంలో పేరు, పుట్టిన తేదీ వంటివి మార్చుకోవడానికి ఆన్‌లైన్‌లోనే ఆప్షన్ ఉండేది. కానీ తర్వాత ఈ ఫెసిలిటీని తీసేశారు. అయితే ఇప్పుడు మళ్లీ ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
ఆధార్ కార్డులో వివరాలు మార్చుకోవాలని భావించే వారు https://ssup.uidai.gov.in/ssup/ లింక్‌పై క్లిక్ చేసి వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆన్‌లైన్‌లో వివరాలు మార్చుకోవాలని భావిస్తే మాత్రం కచ్చితంగా ఆధార్ కార్డుకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి.
Post a Comment