Daily Horoscope: అక్టోబరు 10 రాశి ఫలాలు- అమ్మకాలు-కొనుగోళ్లలో లాభాలు ఉంటాయి
మేషం..
చాలా కాలం సంఘర్షణల తర్వాత ఈ రోజు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. క్రమంగా అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుది. పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈ రోజు మీకు ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. పార్ట్ టైమ్ వ్యాపారం కోసం సమయాన్ని కేటాయిస్తారు. ఆశయాన్ని నెరవేర్చుకుంటారు. కాబట్టి ప్రయత్నాలు ఆపవద్దు. ఈ రోజు మీకు అదృష్టం 80 శాతం అనుకూలిస్తుంది.
వృషభం..
కుటుంబంలో శుభకార్యాల్లో ఏమైనా ఉంటే వాటిలో పాల్గొంటారు. మీ జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మీరు శాశ్వత ఉపయోగం ఉన్న వస్తువులను మాత్రమే కొనాలి. సాయంత్రం మీకు ప్రత్యేక అతిథి రావచ్చు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఉంటే చివరికి అనుకున్నది పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతంగా అందుకుంటారు. ఈ రోజు మీకు అదృష్టం 69 శాతం కలిసి వస్తుంది.
మిథునం..
ఈ రోజు మిథున రాశి వరకు అనుకూలంగా ఉంటుంది. ఊహించని పురోగతి చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మీ సొంత విజయాలను చూసి ఆశ్చర్యపోతారు. పురోగతిని నిలబెట్టుకోవడమే మీ ప్రధాన విధి. లేకపోతే భవిష్యత్తులో ఖ్యాతి దెబ్బతింటుంది. కాబట్టి మీరు అభినందనలతో సంతోషంగా ఉంటారు. మీ పనిపై దృష్టి పెట్టండి. ఈ రోజు మీకు అదృష్టం 70 శాతం మద్దతు ఇస్తుంది.
కర్కాటకం..
ఈ రోజు కర్కాటక రాశి వారు సోదరి, సోదరుడు గురించి చింతిస్తూ సమయాన్ని గడుపుతారు. మీ ప్రయత్నాల ద్వారా సమస్యలన్ని పరిష్కరించుకోగలుగుతారని గుర్తించుకోండి. కుటుంబం పట్ల అంకిత భావంతో ఉంటారు. అందరిపై అభిమానంతో ఉంటారు. మీరు ఎంచుకున్న రంగంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ రోజు మీకు అదృష్టం 55 శాతం కలిసి వస్తుంది.
సింహం..
ఈ రోజు సింహ రాశివారి వ్యాపారాన్ని ఆందోళన చెందుతారు. దీనికి కారణం మీ వ్యాపారం గత కొన్ని రోజులుగా నియంత్రణలో ఉండదు. వ్యాపార సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే అది మీకు మంచిది. ఉద్యోగ, వ్యాపార రంగంలో పూర్తి పెరుగుదల కోరుకుంటే మీరు సోమరితనం వదలివేయాలి. ఈ రోజు మీరు మీ పనిలో శ్రద్ధ అవసరం. ఈ రోజు మీకు అదృష్టం 50 శాతం మద్దతు ఇస్తుంది.
కన్య..
బుధుడు కన్య రాశి నుంచి తుల రాశిలో ప్రవేశించాడు. ఫలితంగా సూర్యుడితో పాటు, బుధుడు కూడా ఈ రాశిలో ఉండటం వల్ల ప్రత్యేకంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేక ఫలితాలు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ పనిని ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఈ రోజు మీకు ప్రయోజనాలు లభిస్తాయి. కుటుంబంలో శాంతి ఉంటుంది. అంతేకాకుండా మీరు ప్రేమ, అప్యాయత పొందుతారు. ఈ రోజు మీకు అదృష్టం 90 శాతం కలిసి వస్తుంది.
తుల..
తుల రాశివారు ఈ రోజు ఆందోళన చెందుతారు. శుక్రుడు వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. మరికొన్ని మీ స్వల్ప దృష్టి స్వభావం వల్ల మీరే సృష్టించుకుంటారు. సామాజిక, వ్యాపార రంగంలో ప్రత్యర్థులతో పోటీపడగలరు. మీ ధైర్యం, తెలివితేటలతో మాత్రమే ప్రజలను ఓడించగలరు. మీ మనస్సు బలహీనంగా దురదృష్టంగా ఉంటారు. ఒకరి గురించి చెడుగా ఆలోచించకండి. ఈ రోజు మీకు అదృష్టం 59 శాతం మద్దతు ఇస్తుంది.
వృశ్చికం..
వృశ్చిక రాశి వారు ఈ రోజు శుభవార్తలను పొందుతారు. వ్యాపార రంగంలో వచ్చే సమస్యలపై ఆధిపత్యం చెలాయించవద్దు. లేకుంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు పనిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆలోచనాత్మకంగా చేస్తారు. వ్యాపారంలో విజయం సాధిస్తారు. అవరోధాలు ఉంటే సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మనసులో ఎలాంటి నిస్సహాయ ఆలోచనలు తీసుకురావద్దు. ఈ రోజు మీకు అదృష్టం 65 శాతం కలిసి వస్తుంది.
ధనస్సు..
ఈ రోజు ధనస్సు రాశివారికి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఫలితంగా ప్రయోజనం పొందుతారు. డబ్బు దాచుకుని ఉంటే దాని ఫలితం అందుకుంటారు. మీరు తప్పకుండా ప్రయత్నం చేయాలి. కుటుంబ బాధ్యతల్లో నిర్లక్ష్యానికి పాల్పడకండి. లేకుంటే పరిస్థితుల్లో దూరాలు ఉండవచ్చు. ఈ రోజు వృత్తి పరంగా పురోగతి ఆత్మవిశ్వాసాన్ని పెంచుంది. ఈ రోజు మీకు అదృష్టం 71 శాతం మద్దతు ఇస్తుంది.
మకరం..
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. గ్రహాల గమనం మీకు అదృష్టం అభివృద్ధికి సహాయపడుతుంది. అమ్మకాల కొనుగోళ్ల విషయాల్లో లాభం ఉంటుంది. అంతేకాకుండా శుభవార్తలు అందుకునే అవకాశముంది. స్నేహితులతో సరదగా సమయాన్ని గడుపుతారు. అనవసరమైన ఇబ్బందులను నివారించండి. ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో సుఖంగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో సానుకూల ఫలితాలుంటాయి. ఈ రోజు మీకు అదృష్టం 80 శాతం కలిసి వస్తుంది.
కుంభం..
కుంభ రాశి వారి ఉన్నతాధికారుల సాన్నిహిత్యం నుంచి ప్రయోజనం పొందుతారు. ఎగుమతి-దిగుమతి వ్యాపారంలోనూ లాభాలను కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమల్లో ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు శుభకరంగా సాగుతుంది. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. సాయంత్రం సమయంలో శుభవార్తలు అందుకుంటారు. మీరు ఎంచుకున్న రంగంలో ప్రయోజనం చేకూరుతుంది. ఈ రోజు మీకు అదృష్టం 90 శాతం మద్దతు ఇస్తుంది.
మీనం..
మీన రాశివారి జీవితంలో పురోగతి సాధిస్తారు. అనేక అధ్యయనాలు, ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగే అవకాశముంది. వివాదాస్పద అంశాలు ముగుస్తాయి. రహస్య శత్రువులు అసూయపడే సహచరుల పట్ల జాగ్రత్త వహించండి. ఈ రోజు ఎవరికైనా రుణాలు ఇవ్వడం మానుకోండి. తల్లిదండ్రులు, గురువులను సేవించి గౌరవించండి. మీరు ఎంచుకున్న ప్రతి రంగంలో విజయాన్ని అందుకుంటారు. ఈ రోజు మీకు అదృష్టం 98 శాతం కలిసి వస్తుంది.
Post a Comment