హృతిక్ రాముడు కాకపోతే ప్రభాస్ ఆ పాత్రలో? | If not Hrithik Ram then Prabhas in that role
అల్లు అరవింద్ - మధు మంతెన కాంబినేషన్ లో రామాయణం 3డిని దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని ఫ్రాంఛైజీ తరహాలో తెరకెక్కిస్తారన్న ప్రచారం ఉంది. ఇక ఇందులో హృతిక్ రోషన్.. దీపిక పదుకొనేలతో సంప్రదింపులు జరపగా ఆ ఇద్దరూ ప్రధాన పాత్రలకు అంగీకరించారన్న ప్రచారం సాగింది.
నితీశ్ తివారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా .. కేరళ అడవుల్లో చిత్రీకరణ కోసం అరవింద్ ఇంతకుముందు అక్కడ ప్రభుత్వంతో ఓ ఒప్పందం చేసుకోవడం చర్చకు వచ్చింది.
ఇక ఈ చిత్రంలో కాస్టింగ్ ఎలా ఉండనుంది? అంటే.. హృతిక్ ఇందులో శ్రీరాముడి పాత్రను పోషిస్తారని భావించగా.. దీపిక సీత పాత్రకు ఎంపికైందని ప్రచారమైంది. కానీ తాజా సమాచారం ప్రకారం.. హృతిక్ ఇందులో రావణుడిగా ప్రతినాయక పాత్రను పోషిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ దీనికి అధికారికంగా ఇంకా కన్ఫర్మేషన్ లేదు.
మరోవైపు ప్రభాస్ ఇందులో శ్రీరాముడిగా నటిస్తే బావుంటుందని అతడి అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఒకవేళ హృతిక్ రావణుడు అయితే అతడిని ఢీకొట్టే శ్రీరాముడు ప్రభాస్ మాత్రమేనంటూ డైహార్డ్ ప్యాన్స్ భావిస్తున్నారట. ఇది ఊహే అయినా నిజం అయితే బావుంటుందని భావిస్తున్నారు. మరోవైపు బ్లాక్ బస్టర్ వార్ సీక్వెల్ లో హృతిక్ వర్సెస్ ప్రభాస్ నటించే వీలుందన్న ప్రచారం వేడెక్కిస్తోంది. ఆ క్రమంలోనే అల్లు రామాయణంపైనా మరోసారి వాడి వేడి చర్చ మొదలైంది.
Post a Comment