Header Ads

డ్రాగన్ దెబ్బకు తట్టుకోలేక హాంకాంగ్ విడిచి వెళ్లిపోతున్నారు | Hong Kong residents leave

 Hong Kong residents leave

హాంకాంగ్.. ఆ చిట్టి దేశం పేరు విన్నంతనే ఒక జోష్ కమ్మేస్తుంది. ఆ మధ్య వరకు సరదాగా హాంకాంగ్ కు వెళ్లే ప్లాన్లు చాలామంది వేసేవారు. అలాంటి ఆ దేశానికి వెళ్లటానికి ఇప్పుడు ఎవరూ ఆసక్తి చూపించటం లేదు. దీని కారణం డ్రాగన్ దేశమే. రెండో ప్రపంచ యుద్ధంలోని ఒప్పందంలో భాగంగా హాంకాంగ్ చైనా ఏలుబడిలోకి రావటం.. పరిమితమైన అధికారాలే ఉన్నా.. తన తీరుతో ఆ చిట్టి దేశానికి చుక్కలు చూపిస్తోంది.

హాంకాంగ్ ఎట్టి పరిస్థితుల్లో చైనా పరిధిలోకి రాదని..ఆ దేశం చెప్పినట్లు తామెందుకు వింటామని హాంకాంగ్ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. నిరసనల్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఎలాంటి అధికారం లేకున్నా.. పక్కనున్న దేశాల సరిహద్దుల మీద కన్నేసే చైనా.. ఒప్పందంలో భాగంగా తనకు వచ్చిన హాంకాంగ్ ను విడిచి పెడుతుందా? డ్రాగన్ తీరుతో హాంకాంగ్ వాసులు ఆందోళన చెందుతున్నారు.

సొంత నేల మీద అభిమానం ఉన్న చాలామంది వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నా.. వారి బలం సరిపోవటం లేదు. ఇదిలా ఉంటే.. హాంకాంగ్ మీద మరింత పట్టు సాధించేందుకు జాతీయ భద్రతా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని పుణ్యమా అని.. చైనాను వ్యతిరేకించే వారి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం మరింత ఈజీగా మారింది. దీంతో.. ఆ దేశం వేధింపుల్ని భరించలేని హాంకాంగ్ వాసులు నిత్య నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇలాంటివేళ.. హాంకాంగ్ వాసులు తమ దేశానికి వస్తే.. వారికి తమ దేశ పౌరసత్వాన్ని కల్పిస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు.

హాంకాంగ్ చైనా చేతుల్లోకి వెళ్లటానికి ముందు వరకు బ్రిటన్ పెత్తనం ఉండేది. బ్రిటన్ తీరుకు.. చైనా తీరుకు సంబంధం లేకపోవటం.. పాలనా తీరులోనూ ఉన్న తేడాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హాంకాంగ్ వాసులు దేశాన్ని విడిచి బ్రిటన్ కు పయమనవుతున్నారు. ఒకప్పుడు ఇరాక్.. అఫ్గానిస్తాన్.. సిరియా లాంటిదేశాల ప్రజలు దేశాల్ని విడిచి విదేశాల బాట పట్టటం చూశాం. స్వర్గతుల్యమైన హాంకాంగ్ లాంటి దేశంలో ఉండి.. పరిమితుల్ని భరించలేక దేశాన్ని విడిచి పెట్టి బ్రిటన్ కు వెళ్లే వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువవుతుంది. చైనానా మజాకానా?

No comments

Powered by Blogger.