సమంత అభిమానుల్ని ఏడిపిస్తున్న ఫ్యామిలీ మ్యాన్..! | Family man making Samantha fans cry
ఎంత ఉత్కంఠ పెట్రేగితే అంత ఆలస్యం చేయాలి! రాజ్ అండ్ డీకే ఇదే నమ్ముతున్నట్టున్నారు! అందుకేనా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 అంతకంతకు ఆలస్యమవుతోంది. ఇదిగో పులి అంటే అదిగో మేక! అన్న చందంగా తయారైంది సీను. ఫ్యామిలీమ్యాన్ సీజన్ 1 ఘనవిజయం నేపథ్యంలో సీజన్ 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కానీ మేకర్స్ రిలీజ్ విషయంలో చాలా ఆలస్యం చేశారన్న విమర్శలు తప్పడం లేదు.
అయితే ఈ తప్పు రాజ్ అండ్ డీకేదేనా? అన్నది ఆరా తీస్తే తెలిసిన సంగతి వేరే. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వివాదాస్పదమైన కంటెంట్ ని అందిస్తోంది. దీని కారణంగా తీవ్ర విమర్శలతో వివాదాల్లో ఇరుక్కుంటోంది. ఇటీవల తాండవ్ .. మీర్జాపూర్ 2 విషయంలోనూ విమర్శలు చెలరేగాయి. హిందువుల మనోభావాల్ని దెబ్బ తీసే అంశాల్ని సిరీస్ లో చేర్చారంటూ ప్రజలు తమకు నచ్చలేదని తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఎదురుదెబ్బల కారణంగా ప్రైమ్ వీడియో ఏదీ సరిగా నిర్వహించలేకపోతోందిట. ఇప్పుడు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 విడుదలను నిరవధికంగా వాయిదా వేసింది.
తాజా కథనాల ప్రకారం.. అవాంఛిత వివాదాల్లో చిక్కుకోవడమే అమెజాన్ ప్రైమ్ కి ముప్పుగా మారిందని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 విషయంలో తప్పు జరగకూడదని చాలా వేచి చూస్తున్నారట. ఇందులో ఎక్కడైనా రెచ్చగొట్టే కంటెంట్ ఉందా లేదా అనేది స్పష్టంగా తెలియకపోయినా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో ప్రజలు దేనికి ఎలా ముడి వేస్తున్నారో చెప్పలేని పరిస్థితి ఉంది. కాలికి వేస్తే మెడకు వేస్తారు. మెడకు వేస్తే కాలికి వేస్తారు!! అన్నట్టుగా ఉంది.
140 కోట్ల మంది జనాభా ఉన్న భారత దేశంలో ప్రైమ్ తన ఇమేజ్ గురించి చాలా ఆందోళన చెందుతోంది. అందుకే షో సృష్టికర్తలు రాజ్ అండ్ డికె అవుట్ పుట్ను ప్రైమ్ వీడియోకు ముందే పరిశీలన కోసం అందజేశారు. ఇకపై విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి దసరా కి రిలీజవుతుందని అన్నారు.. కుదరలేదు. డిసెంబర్ లో ప్రీమియర్ అన్నారు .. వేయలేదు. ఇక ఫిబ్రవరి 12 న డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమవుతున్నారు. ఇందులో మనోజ్ బాజ్పేయి- ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించగా సమంత నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనుందని ప్రచారమవుతోంది. ఇక సీజన్ ఆలస్యమవుతుండడంతో సామ్ ఫ్యాన్స్ లో అసహనం అంతే ఇదిగా కనిపిస్తోంది.
Post a Comment