Header Ads

తెలంగాణలో 372 జాబ్స్‌.. దరఖాస్తుకు 4 రోజులే గడువు.. ఇలా దరఖాస్తు చేసుకోండి | sccl recruitment 2021 notification for 372 posts released details at scclmines com

 

 

SCCL 372 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 4 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.


సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 372 నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు సంబంధించి జనవరి 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 4 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://scclmines.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 372
  • ఫిట్టర్- 128
  • ఎలక్ట్రీషియన్- 51
  • వెల్డర్- 54
  • టర్నర్ లేదా మెషినిస్ట్ ట్రైనీ- 22
  • మోటార్ మెకానిక్ ట్రైనీ- 14
  • ఫౌండర్ మెన్ - 19
  • జూనియర్ స్టాఫ్ నర్స్- 84

విద్యార్హతలు:
పోస్టులను బట్టి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కావడంతో పాటు జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. లేదా బీఎస్‌సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు.

ఇలా దరఖాస్తు చేసుకోండి:
  • అభ్యర్థులు ముందుగా https://scclmines.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో CAREERS సెక్షన్‌లో Recruitment పైన క్లిక్ చేయాలి.
  • రిక్రూట్‌మెంట్‌లో Notification పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత Click here for Details & Apply Online పైన క్లిక్ చేయాలి.
  • Please Click here for a copy of Detailed Notification పైన క్లిక్ చేయాలి.
  • నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది.
  • ఆ తర్వాత Apply Online పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత అప్లయ్‌ చేయాలనుకున్న పోస్టును సెలెక్ట్ చేయాలి.
  • పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి ప్రింట్‌ తీసుకోవాలి.

No comments

Powered by Blogger.