షాకింగ్: నెట్‌ఫ్లిక్స్‌లో నాగార్జున వైల్డ్ డాగ్ చిత్రం! | wild dog gets a solid deal from netflix
లాక్‌డౌన్ సమయంలో థియేటర్స్ అన్నీ మూతపడడంతో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాలని ఓటీటీలో విడుదల చేసి ప్రేక్షకులకి కొంత వినోదాన్ని అందించారు. అయితే ఇప్పుడు థియేటర్స్ తెరుచుకున్నప్పటికీ కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదల అవుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అక్కినేని నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు షాక్ అవుతున్నారు.
వైల్డ్ డాగ్ సినిమాలో నాగార్జున స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో అహిషోర్ సోల్‌మన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు కిరణ్ కుమార్ మాటలు అందిస్తున్నారు. దియా మీర్జా కథానాయికగా నటిస్తోంది. సయామీ ఖేర్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని తీర్చిదిద్దిన వైల్డ్ డాగ్ విజయ్ వర్మ పాత్రలో అక్కినేని నాగార్జున నటించడం ఆనందంగా ఉందని మేకర్స్ అంటున్నారు. అయితే రూ.27 కోట్ల రూపాయలతో వైల్డ్ డాగ్ మూవీని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. జనవరి 26న ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందట. దీనిపై అఫీషియల్ ప్రకటన రావలసి ఉంది.
Post a Comment