ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ వైస్ ఛైర్మన్ కు 9 ఏళ్ల జైలు | Leading electronics giant Samsung vice chairman jailed for 9 years
అత్యుత్తమ ఎలక్ట్రానిక్ సంస్థల్లో ఒకటిగా పేరున్న శాంసంగ్ వైస్ ఛైర్మన్ కు జైలుశిక్ష విధించిన వైనం కార్పొరేట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. కొరియాకు చెందిన ఈ సంస్థ మూలస్తంభాల్లో ఒకరికి భారీ శిక్ష వేసేందుకు ఆ దేశ కోర్టు సిద్ధం కావటం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ శాంసంగ్ వైస్ ఛైర్మన్ లీ జే యంగ్ చేసిన తప్పేమిటి? దీనికి సంబంధించిన శిక్ష ఎప్పుడు విధించనున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి.
ఒక ప్రముఖ టెక్ కంపెనీకి చెందిన వైస్ ఛైర్మన్ కు తొమ్మిదేళ్ల జైలుశిక్ష వేయటానికి కారణం ఏమిటో తెలుసా? ఆ దేశ మాజీ అధ్యక్షుడు జియున్ హే కు లంచం ఇవ్వాలన్న ప్రయత్నం చేయటమే. దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ తన సంస్థ ప్రయోజనాల కోసం దేశ మాజీ అధ్యక్షుడికి లంచం ఇచ్చే ప్రయత్నం చేసింది. దీన్ని గుర్తించిన అధికారులు కేసులు నమోదు చేశారు.
ఈ కేసు విచారణ ప్రస్తుతం కోర్టులో సాగుతోంది. ముగింపు దశకు వచ్చిన ఈ కేసులో శాంసంగ్ వైస్ ఛైర్మన్ కు తొమ్మిదేళ్లు.. ఆయనకు సహకరించిన కంపెనీకి చెందిన ఇద్దరు ఎగ్జిక్యుటివ్ లకు ఏడేళ్లు జైలు విధించాలని కోర్టును కోరారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పు జనవరి 18న వెలువరించనున్నారు. ప్రాథమికంగా వచ్చిన సమాచారం ప్రకారం.. శాంసంగ్ కు చెందిన అత్యుత్తమ స్థాయిలో ఉన్న వ్యక్తికి జైలు ఖరారు కావటం సంచలనంగా మారింది. శిక్షకు సంబంధించిన అధికారిక ప్రకటన జనవరి 18న వెలువడనుంది.
Post a Comment