విశాఖలో అమెరికా హబ్.. దీని ప్రత్యేకత ఏమిటంటే? | US plans to set up India second American Hub in Vizag
ఏపీకి ప్రోత్సాహాన్ని ఇచ్చే నిర్ణయం ఒకటి అమెరికా ఒకటి తీసుకుంది. ఇందుకు ఉక్కునగరం విశాఖ వేదిక కానుంది. అమెరికా కాన్సులేట్ లేని ప్రాంతాల్లో ఈ హబ్ ను ఏర్పాటు చేస్తుంటారు. దేశంలో అహ్మదాబాద్ లో మాత్రమే ఇలాంటి హబ్ ఉంది. తాజాగా ఏపీలోనూ ఏర్పాటు చేయటానికి అగ్రరాజ్యం నిర్ణయం తీసుకుంది.
తాజాగా అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్ మెన్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాము విశాఖలో పర్యటించామని.. అక్కడి వసతులు.. సౌకర్యాలు తమకు ఎంతో నచ్చినట్లుగా తెలిపారు. కాన్సులేట్ లేని నగరాల్లో దేశంలో ఒక్క అహ్మాదాబాద్ లో మాత్రమే ఈ తరహా హబ్ ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇంతకీ ఈ హబ్ అంటే ఏమిటి? ఇందులో ఏముంటుంది? దీని వల్ల రాష్ట్రానికి.. రాష్ట్ర ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..
సాధారణంగా అమెరికన్ కాన్సులేట్ లో ఈ హబ్ ఉంటుంది. ఇందులో అమెరికాకు సంబంధించిన సమస్త సమాచారం ఉంటుంది. ఏ వివరాలుకావాలన్నా ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది లైబ్రరీ లాంటిది. పుస్తకాలతో పాటు.. ఆడియో.. వీడియో.. డిజిటల్ ఫార్మాట్ లో డాక్యుమెంటరీలు లభిస్తాయి.. అమెరికాలో చదువుకోవాలనుకునే వారికి ఈ హబ్ లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.
అక్కడకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తారు. ఎవరైనా సరే.. తమకు అవసరమైన సమాచారాన్ని సేకరించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి హబ్ ఇప్పటివరకు దేశంలో అహ్మదాబాద్ లో మాత్రమే ఉండగా.. ఇప్పుడు విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వాగతించారు. ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వ పని తీరును అమెరికా కాన్సులేట్ జోయల్ రీఫ్ మెన్ ప్రశంసించారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన అభినందించారు.
Post a Comment