బ్రేకింగ్: భూమా అఖిలప్రియ అరెస్ట్.. అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు | Big Breaking Bhuma Akhilapriya arrested
మాజీ మంత్రి టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులనే కిడ్నాప్ చేయడంపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం తో ఉంది. ఈ ఘటన తెలంగాణలో తీవ్ర సంచలనమైంది. ఈ కిడ్నాప్ వెనుక భూమా అఖిలప్రియ భర్త ఆయన సోదరుడు కీలక పాత్రధారులని ఆరోపణలు రావడం.. ఓ 100 కోట్ల భూ వివాదమే ఈ గొడవకు కారణంగా తేలింది.
ఈ క్రమంలోనే కిడ్నాప్ ఉదంతంలో తెలంగాణ పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. బోయినపల్లిలో కేసీఆర్ బంధువులు ముగ్గురిని కిడ్నాప్ చేసిన కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కాగా కూకట్ పల్లిలో ఉన్న ఆమెను అరెస్ట్ చేసి ఆమె సొంత కారులోనే హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు తెలిసింది.
భూమా అఖిల ప్రియను మాత్రమే అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఈ కిడ్నాప్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భర్త భార్గవ్ ఆయన సోదరుడి అరెస్ట్ పై పోలీసుల నుంచి క్లారిటీ రాలేదు.
తాజాగా కేసీఆర్ బంధువులు రాత పూర్వకంగా భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవ్ కిడ్నాప్ చేయించి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Post a Comment