Header Ads

టీకా వచ్చేస్తున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసులెన్నంటే? | Dangerous Disease In Telangana

 Dangerous Disease In Telangana

మాస్కులు పెట్టుకోవటం లేదు. భౌతిక దూరాన్ని పాటించటం మానేసి చాలానే రోజులైంది. అదే పనిగా శానిటైజర్లు రాసుకునే అలవాటు కాస్త తగ్గింది. ప్రాణాంతక కరోనా మన మధ్యనే ఉందన్న విషయాన్ని తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు పెద్దగా పట్టించుకోవటం మానేసి చాలా కాలమే అయ్యింది. దాదాపు తొమ్మిది నెలల పాటు.. భయం గుప్పిట్లో బతికిన ప్రజలు.. ఇప్పుడు అందుకు భిన్నంగా స్వేచ్ఛగా వ్యవహరించాలని కోరుకుంటున్నారు.

అయినప్పటికీ.. గుండెల్లో ఎక్కడో బెరుకు పీకుతోంది. దీంతో.. కొందరు జాగ్రత్తలు తీసుకుంటున్నా.. అత్యధికులు మాత్రం కోవిడ్ రూల్స్ ను దాదాపుగా బ్రేక్ చేసేస్తున్నారు. ఇలాంటివేళ.. కరోనా కేసులు భారీగా నమోదు కావాల్సిన అవసరం ఉంది. లక్కీగా.. ఇంత విచ్చలవిడిగా తిరుగుతున్నప్పటికి కేసుల నమోదు మాత్రం కనిష్ఠంగా ఉండటం గమనార్హం.

తాజాగా ఏపీలో అత్యంత కనిష్ఠ స్థాయిలోకరోనాకేసులు నమోదయ్యాయి. ఒకదశలో రోజుకు 10నుంచి 12 వేల వరకు కేసులు నమోదయ్యాయి. అలాంటిది గడిచిన 24 గంటల వ్యవధిలో 30933 నమూనాల్ని పరీక్షించగా.. కేవలం 121 మందికి మాత్రమే పాజిటివ్ గా తేలింది. ఇంతలా తిరుగుతున్నా.. కేసుల నమోదు ఇంత భారీగా పడిపోవటం చూస్తే.. ఏపీ ప్రజల్లో హెర్డ్ ఇమ్యునిటీ భారీగా పెరిగిందన్న మాట వినిపిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఏమైనా టీకా వస్తున్న వేళ.. ఈ సంకేతం శుభసూచకంగా చెప్పక తప్పదు

No comments

Powered by Blogger.