Header Ads

వ్యూస్ మాయలో నుంచి బయటకు రాలేకపోతున్న టాలీవుడ్..! | Tollywood cant get out of Views

 Tollywood cant get out of Views

టాలీవుడ్ లో ఈ మధ్య మా సినిమా సాంగ్స్ కి ఇన్ని వ్యూస్ వచ్చాయని.. మా సినిమా ట్రైలర్ ఒక్కరోజులో  అన్ని మిలియన్ వ్యూస్ దక్కించుకుందని ప్రచారం చేసుకోవడం ఎక్కువైపోయింది. అయితే సోషల్ మీడియాలో ప్రచారం చేసినంత మాత్రాన.. ఫేస్ బుక్ లో లక్షల కొద్దీ లైకులు.. యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ వచ్చినంత మాత్రాన అవి టిక్కెట్ రూపంలోకి కన్వర్ట్ అవుతాయనేందుకు ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు. ట్రేడ్ నిపుణల విశ్లేషణ ప్రకారం యూట్యూబ్ లో వ్యూస్.. సోషల్ మీడియా బజ్ కారణంగా సినిమా బుక్కింగ్స్ జరిగేది కేవలం రెండు శాతం మాత్రమేనట. అయితే తెలుగు హీరోలు చాలా మంది ట్రెండ్ అని ఫీల్ అవుతూ వ్యూస్ మాయలో నుంచి బయటకు రాలేకపోతున్నారు.

వాస్తవానికి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసే వీడియోల వ్యూస్ కోసం నిర్మాతలు లక్షలు ఖర్చుపెట్టించడం జరుగుతోందట. ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ కోసం దాదాపుగా 80 వేల నుంచి 4 లక్షల వరకు కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఓ సినిమా ట్రైలర్ కి మిలియన్ వ్యూస్ ఆ ట్రైలర్ పెట్టిన యూ ట్యూబ్ ఛానల్ కి ఉన్న సబ్ స్కైబర్స్ ఆధారంగా వస్తే.. ఆ తరువాత వచ్చే వ్యూస్ అన్నీ కూడా ఇలా క్రాస్ ప్రమోషన్స్ పెయిడ్ ప్రమోషన్స్ కారణంగానే వస్తున్నాయట. అంటే 24 గంటల్లో 10 మిలియన్ వ్యూస్.. అన్ని వ్యూస్ ఇన్ని వ్యూస్.. అని బ్యానర్లు వేసుకుంటున్న సినిమా బృందాలు ఆ ఫీట్ అందుకోవడానికి లక్షల్లో చేతి చమురు వదిలించుకున్నారనే అనుకోవాలి. ఈ మధ్యనే వచ్చి యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న పలు సినిమా ట్రైలర్స్ కి మిలియన్స్ కొద్ది వ్యూస్ ఇలా వచ్చినవే అని టాక్. ఏదేమైనా సినిమా వాళ్ళు వ్యూస్ మాయలో నుంచి బయటకు రాలేకపోవడాన్ని క్యాష్ చేసుకుని డిజిటల్ ఏజెన్సీలు విపరీతంగా లాభపడుతున్నాయని తెలుస్తోంది

No comments

Powered by Blogger.