ఉలిక్కిపడేలా చైనా అధ్యక్షుడి మాటల్ని విన్నారా? | Have you heard the words of the President of China to be uttered
చైనా అధ్యక్షుడి నోటి నుంచి తాజాగా వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఉత్త పుణ్యానికే చైనా అధ్యక్షుడు మాట్లాడడు. అందునా బయటకు వచ్చి.. ప్రపంచానికి తెలిసేలా వ్యాఖ్యలు చేయరు. ఒకవేళ చేశారంటూ దానికో వ్యూహం ఉండి ఉంటుంది. ఇంతకీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఏం మాట్లాడారు? ఆయన ఇచ్చిన సందేశం ఏమిటన్న విషయంలోకి వెళితే..
తన సైనిక బలగాలను అప్రమత్తత సందేశాన్ని ఇవ్వటమే కాదు.. పోరాట నైపుణ్యాల్నిమరింత మెరుగుపర్చుకోవాలని చెప్పటం గమనార్హం. ‘ఏ క్షణాన యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ వ్యాఖ్యానించారు. సైనిక బలగాలకు మరిన్ని అధికారాలు కల్పించే కొత్త రక్షణ చట్టం అమల్లోకి వచ్చిన సందర్భంగా మాట్లాడిన జిన్ పింగ్.. ‘వాస్తవ యుద్ధరంగాన్ని పోలి ఉండే పరిస్థితుల్లో శిక్షణ పొందాలి’ అన్న సూచన చూస్తే.. ఇటీవల కాలంలో ఎదురైన చేదు అనుభవాల ప్రభావం ఉందన్న మాట వినిపిస్తోంది.
చైనా కమ్యునిస్టు పార్టీతో పాటు.. కేంద్ర సైనిక కమిషన్ కు జిన్ పింగ్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కమిషన్ కు సంబంధించిన తొలి ఉత్తర్వుపై ఈ ఏడాది సంతకం చేసిన ఆయన.. చైనా సైన్యం.. సాయుధ పోలీసు దళాలకు శిక్షణకు సంబంధించిన ప్రాధాన్యతల్ని అందులో పేర్కొన్నారు. పోరాట వ్యూహాలపై మరింత పరిశోధన చేయాలన్న ఆయన.. యుద్ధ విన్యాసాల్ని పెంచాలని.. ఆధునాత ఆయుధ సంపత్తిని వినియోగించే నైపుణ్యాన్ని కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఇదంతా చూస్తే.. సైన్యాన్ని... భద్రతా బలగాల్ని అలెర్టుగా ఉంచటంలో భాగమంటున్నారు.
Post a Comment