సంచలనం: ఆ మీడియా గ్రూప్ పై ఐటీ దాడులు | Sensation IT attacks on that media group
దేశంలోనే ప్రముఖ మీడియా గ్రూప్ టీవీ చానెల్ అయిన ‘జీ గ్రూప్’పై ఐటీ దాడులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముంబైలోని ‘జీ ’ గ్రూపు కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు.
ముంబైలోని జీఎస్టీ ఇంటెలిజెన్స్ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. 15కి పైగా చోట్ల తనిఖీలు చేశారు.
జీ గ్రూప్ పన్ను ఎగవేతకు పాల్పడడంతోపాటు బోగస్ ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ ను జీ గ్రూపు దాఖలు చేసిందని ఐటీ అధికారులు చెప్పారు. దీంతోపాటు లార్సెన్ అండ్ టౌబ్రో(ఎల్ అండ్ టీ) కంపెనీలో కూడా ఐటీ అధికారులు సోదాలు జరిపారు.
ఇటీవల ఐటీ శాఖకు జీగ్రూప్ భారీ స్థాయిలో జీఎస్టీ ఎగవేతకు పాల్పడిందన్న ఫిర్యాదులు అందాయి. దీంతో పన్ను ఎగవేత కేసుల్లో వివిధ గ్రూపులకు చెందిన కొన్ని కార్యాలయాల్లో సోదాలు జరిపామని ఐటీ అధికారి తెలిపారు.
ఇక ఐటీ సోదాలపై జీ ఎంటర్ టైన్ మెంట్ స్పందించింది. ఐటీ దాడులు నిజమేనని.. విచారణకు సహకరిస్తామని తెలిపింది.
Post a Comment