చిన్నారులపై తీర్పులిచ్చిన జడ్జికి షాకిచ్చిన సుప్రీంకోర్టు! | The Supreme Court was shocked by the judge who ruled on the minors
బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ఫ గనేడివాలాకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. కొన్ని రోజులుగా ముంబై హైకోర్టులో చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో ఈమె వివాదాస్పద తీర్పులు ఇస్తూ దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. నాగపూర్ బెంచ్ లో ఉన్న ఈమె ఇటీవల '12 ఏళ్ల చిన్నారి శరీరాన్ని చాతి భాగాన్ని వృద్ధుడు తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదని' తీర్పునిచ్చింది.
ఇక మరో కేసులో దుస్తుల పై నుంచి శరీర భాగాలను తాకడం వేధింపులు అనలేమని.. బాలిక దుస్తులు తొలగించి.. లోపలికి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని వివాదాస్పద తీర్పులను జస్టిస్ పుష్ప ఇవ్వడం దుమారం రేపింది.
ఇక ఇటీవలే మైనర్ బాలికల చేతులు పట్టుకోవడం.. వారి ముందు పురుషులు ప్యాంటు జిప్ విప్పుకోవడం కూడా లైంగిక వేధింపుల కిందికి రాదని తీర్పును జస్టిస్ పుష్ప ఇచ్చింది. పోక్సో చట్టం కింద దీన్ని పరిగణించమని పేర్కొంది. కింద కోర్టులు ఇచ్చిన శిక్షలను ఈమె రద్దు చేశారు. ఈ తీర్పులు తీవ్ర దుమారం రేపాయి.ఇటీవల అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఓ కేసులో జస్టిస్ పుష్ప తీర్పును సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆమె వ్యాఖ్యలు ఆందోళనకరమని వాదించారు. దీంతో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
తాజాగా బాంబే హైకోర్టులో ఆమెకు శాశ్వత హోదా కల్పించేలా సుప్రీంకోర్టు కోలిజియం చేసిన సిఫార్సును వెనక్కి తీసుకున్నట్టు సమాచారం. కొలీజియం సిఫార్సుల మేరకు జడ్జీల శాశ్వత నియామకం జరుగుతుందన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వీటిని ఆమోదించవచ్చు లేదా మరికొన్ని ప్రతిపాదనలు చేస్తూ తిరిగి పంపించవచ్చు.2018లో జస్టిస్ పుష్ప బాంబే హైకోర్టు జడ్జిగా నియమితులైనప్పటికీ న్యాయస్థానం వ్యతిరేకించడంతో ఆమె కొన్నాళ్లపాటు వేచిచూడాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఇందుకు సానుకూలంగా స్పందించడంతో ఆమెకు నిరాశ ఎదురైంది.
Post a Comment