Header Ads

'ఆచార్య' లో కొరటాల మార్క్ మిస్ అయిందా..? | Chiranjeevi Roars as The Saviour

 Chiranjeevi Roars as The Saviour

మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా టీజర్ నిన్న శుక్రవారం రిలీజ్ అయింది. విడుదలై కొన్ని నిమిషాల్లోనే రికార్డు స్థాయి వ్యూస్ అందుకుంది. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్లో 6 మిలియన్స్ పైగా వ్యూస్.. సుమారు 5 లక్షల లైక్స్ తో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’ అని మెగాస్టార్ చెప్పిన డైలాగ్ కి మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ జత కలిసి అదుర్స్ అనిపించింది. అయితే అదే సమయంలో ఇందులో కొరటాల శివ మార్క్ ఎక్కడో మిస్ అయిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

'ఆచార్య' టీజర్ కి పాజిటివ్ కామెంట్స్ ఎన్ని వస్తున్నాయో నెగిటివ్ కామెంట్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. కొరటాల గత చిత్రాలతో కంపేర్ చేసుకున్న అభిమానులు.. నిజంగానే ఈ చిత్రాన్ని కొరటాలే డైరక్షన్ చేస్తున్నాడా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే బోయపాటి ఏమైనా కొరటాలని పునాడా.. టీజర్ మొత్తం బోయపాటి స్టైల్ లో ఉంది అని అంటున్నారు. ఏదేమైనా భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఆచార్య' సినిమా టీజర్ లో కొరటాల మార్క్ ఎక్కడో మిస్ అయిందనే మాటలు ఫిలిం సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి సినిమా విడుదల అయ్యాక ఈ కామెంట్స్ చేసే వారందరికీ సమాధానం దొరుకుతుందేమో చూడాలి. ఇకపోతే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments

Powered by Blogger.