Header Ads

ఈ టీ తాగితే పీరియడ్ త్వరగా వస్తుందట.. | herbal tea is good for irregular periods know here all details

 

చాలా మంది మహిళలు పీరియడ్ ఫ్లో లో కొన్ని తేడాలు 

ఎదుర్కొంటూనే ఉంటారు. డాక్టర్స్ చెబితే తప్ప దీని కోసం ఎవరికి వారు మెడిసిన్స్ వేసుకోవడం అంత మంచి పద్ధతి కాదు కాబట్టి కొన్ని సంప్రదాయ సిద్ధం గా ఉన్న మూలికలు, దినుసులు ట్రై చేయవచ్చు అంటున్నారు ఈ రంగంలో నిపుణులు.
ఇక్కడ సింపుల్ గా తయారు చేసుకోగలిగే నాచురల్ హెల్బల్ టీ రెమెడీస్ ఉన్నాయి, చూడండి. ఈ హెర్బల్ టీలని ఇంట్లోనే ఉండే దినుసులతోనే తయారు చేసుకోవచ్చు. ఈ దినుసులు ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలని ఎఫెక్టివ్ గా ఎదుర్కొంటాయని ప్రూవ్ అయింది కూడా. నిపుణుల సూచన ప్రకారం ఈ హెర్బల్ హోమ్ రెమెడీస్ ని కనీసం ఒక నెల పాటూ వాడితే మంచి ఫలితాలు కనబడతాయి.
దాల్చిన చెక్క టీ

ఇందు కోసం మీకు కావాల్సినది ఒక అంగుళం దాల్చిన చెక్క. దీన్ని నీటిలో మరగబెట్టి, చల్లర్చి, వడకట్టి పరగడుపునే తాగేయండి. కనీసం ఒక నెల పాటూ ఈ దాల్చిన చెక్క టీని ట్రై చేయండి.

ప్రయోజనాలు..

దాల్చిన చెక్క మహిళల్లో సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని బూస్ట్ చేస్తుంది. యుటెరైన్ ఫైబ్రాయిడ్స్, పీసీఓఎస్ వంటి వాటితో డీల్ చేస్తుంది. బరువు తగ్గడానికి సహకరిస్తుంది. మెన్స్ట్రువల్ ఫ్లో ని రెగ్యులేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.

అల్లం, తులసి టీ..

ఈ టీ చేయడానికి మీకు కావాల్సినవి అరంగుళం అల్లం, మూడు నాలుగు తులసి ఆకులు. వీటిని నీటిలో మరగబెట్టి పరగడుపునే తాగేయండి. కనీసం ఒక నెల పాటూ ఈ అల్లం తులసి టీని ట్రై చేయండి.
ప్రయోజనాలు..

*తులసి యాండ్రొజెన్స్ ని కంట్రోల్ చేసి ఇన్సులిన్ లెవెల్స్ ని మోడరేట్ చేయగలదు. తులసి చక్కని యాంటీ ఆక్సిడెంట్ కూడా.
* అల్లం ఫీమేల్ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇది వికారాన్ని బాగా తగ్గిస్తుంది. ఇందులో ఎన్నో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి.
* అల్లం ప్రోస్టగ్లాండిన్స్ యొక్క ప్రొడక్షన్ ని రెడ్యూస్ చేస్తుంది, ఫలితంగా క్రాంప్స్, మూడ్ స్వింగ్స్, తలనొప్పి వంటి ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోం తాలుకు లక్షణాలు కూడా రెడ్యూస్ అవుతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

No comments

Powered by Blogger.