ట్రెండింగ్ అవుతున్న సాయి పల్లవి డాన్స్ స్టెప్ | Sai Pallavi Dance Step Goes Viral In Social Media
డాన్సర్ గా కెరీర్ ను ప్రారంభించిన సాయి పల్లవి మల్టీ ట్యాలెంటెడ్ గా గుర్తింపు దక్కించుకుంది. హీరోయిన్ గా ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే టాప్ ప్లేస్ లో ఉన్న ఈ అమ్మడు అతి త్వరలో నాగచైతన్యతో కలిసి లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ స్టోరీ సినిమా టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. టీజర్ లో సాయి పల్లవి హైలైట్ అయ్యింది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ నటన మరియు డాన్స్ తో టీజర్ అదరగొట్టింది.
ముఖ్యంగా సాయి పల్లవి వర్షంలో పైకి జంపింగ్ చేసే షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవి అభిమానులు ఆమె డాన్స్ కు ఎప్పుడు ఫిదా అవుతూనే ఉంటారు. ఫిదా మరియు ఇంతకు ముందు సినిమాల్లో కూడా సాయి పల్లవి ఇలాంటి జంపింగ్ స్టెప్ ను వేసింది. హీరోయిన్స్ లో సాయి పల్లవికి మాత్రమే ఇలాంటి స్టెప్ లు సాధ్యం అవుతాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నాయి. సాయి పల్లవి ఆ స్టెప్ ను కట్ చేసి చాలా మంది షేర్స్ చేస్తున్నారు. ఇలాంటి స్టెప్ ఉంటే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ ను కూడా అభిమానులు నమ్ముతున్నారు.
Post a Comment