Header Ads

దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మోడీ | Modi tells good news to the people of the country

 Modi tells good news to the people of the country

ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. జనవరి 16 నుంచి దేశంలో కరోనా వ్యాక్సిన్ భారతదేశంలో ప్రారంభమవుతుందని.. టీకా వేయించుకోబోయే వారికయ్యే ఖర్చు కేంద్రప్రభుత్వమే భరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెల్లడించారు.

మూడు కోట్ల మంది హెల్త్ ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకాలను ఉచితంగా ఇవ్వనున్నట్లు మోడీ వెల్లడించారు. కరోనా సంక్షోభ సమయంలో అందరూ ఒక్కటై పనిచేశారని.. మిగతా దేశాలకన్నా భారత్ లో కరోనా వ్యాపించలేదని చెప్పుకొచ్చారు.  ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ తదితర విషయాలపై కీలక విషయాలు చెప్పుకొచ్చారు.

తొలి దశలో ప్రభుత్వ ప్రైవేటు రంగాలకు చెందిన 3 కోట్ల మంది కరోనా యోధులకు ఈ టీకా ఇస్తామన్నారు. వీరిలో ప్రజాప్రతినిధులు ఉండబోరని మోడీ స్పష్టం చేశారు. రెండో దశలో 50 ఏళ్ల పైబడిన వారికి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 50 ఏళ్లలోపు వారికి ప్రాధాన్యతనిస్తామన్నారు. జూలై నాటికి దేశంలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

ఈ ఖర్చంతా కేంద్రప్రభుత్వమే భరిస్తుందని.. రాష్ట్రాలపై ఎలాంటి భారం పడదని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు.కోవిషీల్డ్  వ్యాక్సిన్ ఒక డోసుకు 200 రూపాయల చొప్పున అందించనున్నట్లు సీరమ్ సంస్థ తెలిపింది. ప్రతి వారం కొన్ని మిలియన్ మోతాదుల కోవిషీల్డ్ సరఫరా చేస్తామని.. ప్రారంభంలో 11 మిలియన్ మోతాదులను సరఫరా చేయవచ్చునని తెలుస్తోంది.

No comments

Powered by Blogger.