రవితేజ కూతురు ఇంత అందంగా.. హీరోయిన్ గా చేస్తుందట! | Ravi Teja daughter is so beautiful as a heroine
రవితేజ కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా.. అని ఆశ్చర్యపోతున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఆమె రియల్ కూతురు కాదు.. రీల్ డాటర్! మాస్ రాజా రవితే - దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన ‘విక్రమార్కుడు’ సినిమాలో విక్రమ్ రాథోడ్ కూతురిగా నటించిన పాప గుర్తుందికదా.. ఆ చిన్నారి ఇప్పుడు టీనేజ్ లో ఉంది. చాలా కాలంగా కెమెరా ముందుకురాని ఈ బేబీ.. యంగ్ లుక్ లో అదరగొడుతోంది.
సినీ పరిశ్రమలోకి నటీనటులతోపాటు చైల్డ్ ఆర్టిస్టులు వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసులో నిలిపోతారు. అలాంటి వారిలో నేహా తోట ఒకరు. విక్రమార్కుడు సినిమాలో తల్లి లేని పిల్లగా అమాయకమైన చూపులతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత రామ్గోపాల్ వర్మ ‘రక్ష’ సినిమాలో దెయ్యం పట్టిన పాత్రతో అందరినీ భయపెట్టింది. ఆ తర్వాత అనసూయ రాముడు వంటి చిత్రాల్లో కనిపించిన ఈ చిన్నారి.. చదువుకోవాలంటూ నటనకు కామా పెట్టేసి వెళ్లిపోయింది.
ప్రస్తుతం ఈ అమ్మడు టీనేజ్ లో ఉంది. బిజినెస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేసోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నేహా.. తన ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది. హీరోయిన్ రేంజ్ వచ్చేసిందిగా.. సినిమాలు ఎందుకు చేయట్లేదని నెటిజన్లు ప్రశ్నిస్తే.. స్టడీస్ కంప్లీట్ అయ్యాక చూస్తానని చెప్తోంది. యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని భవిష్యత్ లో సినిమా అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పింది. అయితే.. దానికి ఇంకా టైం ఉందని చెప్పుకొచ్చింది నేహా.
Post a Comment