ధైర్యంగా వ్యాక్సిన్ వేయించుకోండి!-ఉపాసన | Upasana Konidela Talking About Corona Vaccine
దేశంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కి తొలిగా వ్యాక్సినేషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారీపై యుద్ధంలో పోలీసులు ఆస్పత్రి సిబ్బంది సహా అనుబంధ సిబ్బంది ఎన్నో సేవల్ని అందించారు. వీరికి తొలిగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తవుతోంది.
అయితే వ్యాక్సిన్ అందరికీ సరిపడడం లేదని కొందరికి వికటిస్తోందని ఇటీవల ప్రచారమైంది. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఒకరిద్దరు మరణించడం అది మీడియాలో హైలైట్ కావడంతో దానిపై అపోహ పెరిగింది.
దీంతో అపోలో అధినేత్రి ఉపాసన కొణిదెల స్వయంగా రంగంలోకి దిగి అపోలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ధైర్యం చెప్పాల్సొచ్చింది. తాను వ్యాక్సినేషన్ వేయించుకుని ఇతరులకు ధైర్యం చెప్పారు ఉపాసన. అందరూ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావాలని కోరారు.
తన హాస్పిటల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ను కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఈ వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుంటేనే కరోనా మహమ్మారినుండి బయట పడతామని ఆమె అన్నారు. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి అంతర్జాలంలో వైరల్ అవుతోంది.
Post a Comment