సర్వేలో వ్యాక్సిన్ పై ప్రజాభిప్రాయమిదీ | Public opinion on the vaccine
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి ఎట్టకేలకు వ్యాక్సిన్ వచ్చేసింది. భారత్ లో రెండు టీకాలకు ఆమోదం లభించింది. వాటిని ముందుగా ఫ్రంట్ లైన్ కార్మికులకు వేసేస్తున్నారు కూడా. అయితే వ్యాక్సిన్ తీవ్రత తగ్గి అందరూ దాన్ని తట్టుకోగల ఇమ్యూనిటీ సంపాదించడంతో ఇక ఎవరూ ఆ వైరస్ కు భయపడడం లేదు. స్వేచ్ఛగా మునుపటిలాగా పనిచేసుకుంటున్నారు. వ్యాక్సిన్ వేసుకోవాలన్న తొందర ఉత్సాహం జనాల్లో అస్సలు కనిపించడం లేదు.
దీర్ఘకాలిక రోగులు అవయవ సమస్యలున్న వారు తీవ్ర అనారోగ్యాలతో ఉన్న వారు మాత్రమే వ్యాక్సిన్ కోసం చూస్తున్నారు తప్ప మిగతా వారంతా అస్సలు దీని గురించి ఆలోచించడం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే.ఈ క్రమంలోనే తాజాగా మా 'తుపాకీ.కామ్' త్వరలో ''అందుబాటులో రానున్న కరోనా వ్యాక్సిన్ ను వేయించుకుంటారా?'' అన్న ప్రశ్నను పాఠకులకు సంధిస్తే ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది.
తుపాకీ.కామ్ నిర్వహించిన ఈ పోల్ లో దాదాపు అత్యధికంగా 36.53శాతం మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటామని తెలుపడం విశేషం. అయితే అంతకు దగ్గరగా 31.15శాతం మంది తాము కరోనా వ్యాక్సిన్ వేయించుకోమని కుండబద్దలు కొట్టారు. అంటే వేయించుకునే వారి సంఖ్య.. అస్సలు ఆసక్తి లేని వారి దాదాపుగా దగ్గరగా ఉన్నట్టే లెక్క.
ఇక వీరిద్దరి అభిప్రాయాలకు భిన్నంగా కరోనా వ్యాక్సిన్ ఫలితాలు పూర్తిగా వెలువడ్డాకనే వేసుకుంటామని.. అప్పటివరకు వేచిచూస్తామని 25.95శాతం మంది చెప్పుకొచ్చారు. ఇక ఈ గందరగోళంతో ఏమో చెప్పలేం అంటూ 6.37శాతం మంది అభిప్రాయాన్ని చెప్పలేకపోయారు. వీరు వ్యాక్సిన్ వేసుకోవడానికి.. వద్దు అని చెప్పడానికి కూడా సిద్ధంగా లేరు.ఈ సర్వేను బట్టి దాదాపు వేసుకోవడానికి సిద్ధంగా లేని వారు 57శాతం మంది ఉండడం గమనించాల్సిన విషయం. అంటే ప్రభుత్వం ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీకి రెడీ అయినా కూడా జనాభాలో సగం మంది దీనిపై ఆసక్తి లేరని తెలుస్తోంది.
Post a Comment