రీ రిలీజ్ లో 'వి' కంటే బుజ్జిగాడు బెటర్ | Orey Bujjigaa Movie Re Release
కరోనా కారణంగా మార్చి నుండి దాదాపుగా నవంబర్ వరకు థియేటర్లను మూసేసి ఉంచారు. దాదాపుగా 8 నెలల పాటు బొమ్మ పడిందే లేదు. ఆ సమయంలో చాలా సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేశారు. ఆర్థికపరమైన ఇబ్బందులు మరియు ఇతరత్ర కారణాల వల్ల థియేటర్లు ఓపెన్ అయ్యే వరకు వేచి ఉండలేక చాలా సినిమాలను డైరెక్ట్ రిలీజ్ చేశారు. అందులో ముఖ్యమైనవి 'వి' మరియు 'ఒరేయ్ బుజ్జిగా'. ఈ రెండు సినిమాల్లో 'వి' సినిమాకు ప్రేక్షకుల నుండి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. కాని ఒరేయ్ బుజ్జిగా సినిమాను మాత్రం ప్రేక్షకులు ఆధరించారు. ఎంటర్ టైన్ మెంట్ బాగుందని టాక్ వచ్చింది. ఈ సినిమాలు మళ్లీ థియేటర్లలో కూడా విడుదల అయ్యాయి.
థియేటర్లు పునః ప్రారంభం అయిన సమయంలో కొత్త సినిమాలు విడుదలకు ముందుకు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీ లో విడుదల అయిన సినిమాలను కూడా ప్రదర్శణకు పెట్టారు. వి.. ఒరేయ్ బుజ్జిగా ఇంకా కొన్ని ఓటీటీ సినిమాలను థియేటర్లలో విడుదల చేశారు. మినిమం వసూళ్లు నమోదు అవుతాయని అంతా భావించారు. కాని అనూహ్యంగా సినిమాలు ఏవీ కూడా మంచి వసూళ్లను నమోదు చేయలేక పోయాయి. పాత సినిమాలనే భావన వల్లనో లేదా మరేంటో కాని ఓటీటీ సినిమాలను జనాలు పట్టించుకోలేదు. నాని 'వి' సినిమా 16 లక్షల షేర్ ను రాబట్టగా ఒరేయ్ బుజ్జిగా సినిమా మాత్రం దాదాపుగా పాతిక లక్షల షేర్ ను దక్కించుకుంది. డర్టీ హరి సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. కేవలం 15 లక్షలు మాత్రమే ఆ సినిమా రాబట్టింది.
Post a Comment