ఈ ఎలిజిబుల్ 'బ్యాచిలర్'ని బ్యాడ్ టైం వదలట్లేదుగా..!! | Most Eligible Bachelor Release Date Fixed
కెరీర్ ప్రారంభం నుంచీ హిట్ రుచిచూడని టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్. తన నాలుగో సినిమాగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రూపొందుతుంది. ఈ సినిమాకు ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పై అక్కినేని ఫ్యామిలీ అక్కినేని అభిమానులు ఆశలు మాములుగా పెట్టుకోలేదు. వరస ప్లాపుల్లో కూరుకుపోతున్న ఈ హీరోను బొమ్మరిల్లు భాస్కర్ ఎంతవరకూ గట్టెక్కిస్తాడు.. అనేది ఇండస్ట్రీలో పెద్దసవాల్ గా మారింది. అఖిల్ ఈ సినిమాలో మధ్యతరగతి యువకుడిగా కనిపిస్తాడని గీతగోవిందం తరహాలో ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్ అని అంటున్నారు మేకర్స్. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు వాసువర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా మొన్నటి వరకు కరోనా కోరల్లో చిక్కుకొని వాయిదాపడుతూ వచ్చింది.
సినిమా మొత్తం విడుదలకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. నిజానికి సంక్రాంతి బరిలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు ఇదివరకు హింట్ ఇచ్చారు. కానీ కొన్ని సీన్స్ రీషూట్ చేస్తున్నారట. అందుకే సినిమా సంక్రాంతికి విడుదల కావట్లేదు. ఇప్పుడు విడుదల కాలేదంటే సమ్మర్ వరకు ఆగాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా యూనిట్.. ఓటిటిలో విడుదల చేస్తారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కానీ నాగార్జున హీరో అఖిల్ స్పందించి ఎంత ఆలస్యం అయినా థియేటర్లోనే విడుదల చేయాలనీ రిక్వెస్ట్ చేశారట. మరీ సమ్మర్ లోపే రిలీజ్ చేయొచ్చు కదా అంటే కొత్త సినిమాలకు సీజన్ కాదట. ఇక అఖిల్ నాలుగో సినిమాకి కూడా ఎన్ని అడ్డంకులో అంటూ వాపోతున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్.. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. అసలు విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు!
Post a Comment